‘రేవంత్! ఇదేనా విశ్వాసం?: నమ్మి వెళితే నట్టేట ముంచుతాడు, ‘తండ్రి’ అంటూనే.. ’

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ నగర అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాలు, పదవీకాంక్షతోనే రేవంత్ రెడ్డి టీడీపీని వీడారని ఆయన ఆరోపించారు.

  TRS అంచనాలు రివర్స్: ఎదురులేని రేవంత్
  తండ్రిలాంటి వారంటూనే..

  తండ్రిలాంటి వారంటూనే..

  ఎవరు వెళ్లిన ప్రజల అండ ఉన్న టీడీపీకి ఢోకా లేదని చెప్పుకొచ్చారు. టీడీపీ కార్యాలయంలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ వల్లే ఈ స్థాయికి ఎదిగా, చంద్రబాబు నా తండ్రి లాంటి వారంటూనే టీడీపీకి నష్టం చేస్తున్నారని మండిపడ్డారు.

  నీలా! మూటలు, పదవుల కోసం కాదు: ఎర్రబెల్లిపై సీతక్క తీవ్ర విమర్శలు

   ఇదేనా? నువ్వు చూపే విశ్వాసం..

  ఇదేనా? నువ్వు చూపే విశ్వాసం..

  హైదరాబాద్ జిల్లా నుంచి ఒకరిద్దరు చోట నాయకులు తప్ప, రేవంత్ వెంట ఎవరూ వెళ్లలేదని చెప్పారు. సీనియర్లను పక్కన పెట్టి పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చి బాధ్యతలు అప్పగిస్తే.. ఇదా నువ్వు చూపే విశ్వాసం? అంటూ శ్రీనివాసరావు దుయ్యబట్టారు.

  ఏం సందేశం ఇస్తున్నారు?

  ఏం సందేశం ఇస్తున్నారు?

  ఎన్టీఆర్ స్ఫూర్తి అంటూనే.. ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే టీడీపీ ప్రారంభించారో.. లదే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేరడాన్ని ఏమని అంటారని ప్రశ్నించారు. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన పార్టీలో చేరి ప్రజలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారో స్పష్టం చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

   నట్టేట ముంచుతాడు?

  నట్టేట ముంచుతాడు?

  అంతేగాక, రేవంత్‌ను నమ్మి వెళ్లిన ఎవరినైనా నట్టేట ముంచుతాడని ఆయన హెచ్చరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో గురువారం జరగనున్న సమావేశానికి నేతలు, కార్యకర్తలు హాజరుకావాలని శ్రీనివాసరావు కోరారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  TDP Hyderabad president MN Srinivasa Rao on Tuesday fired at Revanh Reddy for joining in Congress Party.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి