ఏపీ ఎఫెక్ట్: తెలంగాణలో మొబైల్‌ ఫోన్లు మరింత చౌక

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సెల్‌ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. ఎందుకంటే.. సెల్‌ఫోన్లపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌)ను ఐదు శాతానికి తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఇప్పటి వరకూ మొబైల్‌ ఫోన్లపై 14.5శాతం పన్ను వసూలుచేస్తుండగా ఐదు శాతానికి తగ్గించారు. ఆంధ్రప్రదేశ్‌ సహా దక్షిణాది రాష్ట్రాలు మొబైల్‌ ఫోన్లపై ఐదు శాతం పన్ను వసూలుచేస్తున్నాయి.

Mobile Phones price will decreased in Telangana

ఈ నేపథ్యంలో తెలంగాణలో అధిక పన్ను అమ్మకాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో తాజాగా వ్యాట్‌ను తగ్గించారు.

తెలంగాణ వ్యాట్‌ చట్టం-2005లో షెడ్యూలు నాలుగులోకి మొబైల్‌ ఫోన్లను తీసుకువస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి (వాణిజ్యపన్నులు) అజయ్‌ మిశ్రా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mobile Phones price will decreased in Telangana state.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి