మోడీనే రెట్టింపు అప్పులు చేశారు: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
గత ప్రధానుల కంటే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ రెట్టింపు అప్పులు చేశారని ఆరోపించారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని తమ గుప్పిట్లో పెట్టుకుని కొందరికే లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారంటూ ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విధానాలకు నిరసనగా దేశంలోని అన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ గురువారం ఆందోళనలు నిర్వహించింది.
ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అదానీ వ్యవహారాన్ని చట్టసభల్లో రాహుల్ గాంధీ బయటపెట్టారని సీఎం రేవంత్ తెలిపారు. దేశానికి రూ. 183 లక్షల కోట్ల అప్పులున్నాయి. 16 మంది ప్రధానులు చేసిన అప్పుల కంటే నరేంద్ర మోడీ రెండింతలు ఎక్కువ చేశారు. మోడీ తన పరివరాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు.

దేశాన్ని మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీ చెరబట్టారని సీఎం రేవంత్ ఆరోపించారు. సెబీ చైర్ పర్సన్ అక్రమాలపై విచారణ జరపాలన్నారు. రాజీవ్ గాంధీ తెచ్చిన సాంకేతిక విప్లవం వల్లే ఐటీ అభివృద్ధి సాధ్యమైందని, ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తెచ్చి ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచారన్నారు. ఈ నిరసనల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ..హిండెన్ బర్గ్ అనే సంస్థ అదానీ అక్రమాలపై ఆధారాలు కూడా బయటపెట్టింది. మోడీ, అదానీ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని ప్రజల ఆస్తులు కాజేస్తున్నారని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారు. అలా అడిగినందుకు ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప అదానీ తప్పులపై మాత్రం చర్యలు లేవు. అందుకే ఈడీ ఆఫీసు ముందు నిరసన తెలుపుతున్నామన్నారు.
Live: TPCC Protest at ED Office https://t.co/xFbQjlNIpi
— Revanth Reddy (@revanth_anumula) August 22, 2024
మరో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అదానీ అక్రమ ఆస్తులపై జాయింట్ పార్లమెంట్ కమిటి వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అదానీ అక్రమాలపై జేపీసీ వేస్తే ఇబ్బంది ఏంటి? అని ప్రశ్నించారు. అదానీ ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని లేదంటే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని వ్యాఖ్యానించారు. అవినీతికి పెద్దన్నగా నరేంద్ర మోడీ వ్యవహరించారుని ఆరోపించారు.
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..












Click it and Unblock the Notifications