MLC Kavitha బెయిల్ కోసం మోడీ పరీక్షా పే చర్చ.. ఏం వాదనబ్బా ఇది!!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడి అధికారులు అరెస్ట్ చేయగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత తనకు బెయిల్ కావాలని రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై జరిగిన విచారణలో కవిత తరపు న్యాయవాదులు వాదించిన తీరు, మోడీ ప్రస్తావన తెచ్చి వారు చెప్పిన విషయాలు ప్రస్తుతం ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి.

కవిత బెయిల్ వాదనలో మోడీ ప్రస్తావన
కవిత తరపున అభిషేక్ మను సింఘ్వి, ఈడీ తరపున జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. కవిత తరపున వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వి కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, మానవతాకోణంలో ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీ పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని కోర్టులో ప్రస్తావించారు. పిల్లలకు పరీక్షల పట్ల భయం పోగొట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు.

Modi pariksha pe charcha for mlc kavitha bail interesting argument of kavitha lawyer

మోడీ లెక్చర్ లను ప్రస్తావిస్తూ వాదన
పరీక్షల సన్నద్దతపై ప్రధాని మోడీ చాలా సందర్భాలలో తల్లిదండ్రుల బాధ్యతను గుర్తు చేస్తూ లెక్చర్లు ఇచ్చారని కవిత తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. పరీక్షల సమయంలో పిల్లలకు తల్లి మోరల్ సపోర్ట్ ఉండాలని, ఈ విషయాన్ని ప్రధాని మోడీ సైతం తన ప్రసంగాలలో చెప్పారని పేర్కొన్నారు. తల్లిని అరెస్టు చేస్తే ఆ ప్రభావం తనయుడిపై ఉంటుందని, తండ్రి తల్లి కోసం న్యాయపోరాటం చేయడంలో బిజీగా ఉన్నాడన్నారు.

కవితకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి
ఫలితంగా కవిత కొడుకు పరీక్షలను సరిగా రాయలేడని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు . తల్లి పరిస్థితి ఇలా ఉంటే కొడుకు పరీక్షల మీద శ్రద్ధ పెట్టలేడని, కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పరీక్షల భయం లో ఉన్న కవిత కుమారుడి కోసం ఆమెకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

అవాక్కయ్యేలా కవిత తరపు న్యాయవాది లాజికల్ వాదన
ఒక మహిళగా, ప్రజాప్రతినిధిగా ఆమె బెయిల్ పొందవచ్చని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మానవతా దృక్పథంతో స్పందించి కవిత కుమారుడి పరీక్షల నేపథ్యంలో, తల్లికి బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. మొత్తానికి కవిత తరపు న్యాయవాది వాదన మాత్రం ఇది తెలిసిన ప్రతీ ఒక్కరినీ అవాక్కయ్యేలా చేసింది. ఏం లాజిక్ భయ్యా అనుకునేలా చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+