'చరిత్ర పునరావృతం కాదని ఆశిస్తున్నా..!': మోడీ ఎమర్జెన్సీ ట్వీట్‌కు కేటీఆర్ రీట్వీట్
హైదరాబాద్: భారతదేశ చరిత్రలో అత్యంత దుర్భరమైన చీకటి రోజులుగా ఎమర్జెన్సీ కాలాన్ని ప్రధాని మోడీ అభివర్ణించారు. ఎమర్జెన్సీ ప్రకటించి నలభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మోడీ ధ్వజమెత్తారు.
చైతన్యవంతమైన, స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం ప్రగతికి అత్యంత ముఖ్యమని, ప్రజాస్వామిక విలువలు, సిద్ధాంతాలను పరిరక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని అన్నారు. ఎమర్జెన్సీకి 40 ఏళ్లు నిండిన సందర్భంగా ఆయన ట్విట్టర్‌లో స్పందించారు.

‘భారత దేశ చరిత్రలో అత్యంత చీకటి రోజులయిన నలభై ఏళ్ల నాటి ఎమర్జెన్సీని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆ సమయంలో అప్పటి రాజకీయ నాయకత్వం మన ప్రజాస్వామ్య గొంతు నులిమేసింది' అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
ప్రధాని మోడీ చేసిన ట్వీట్‌కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. 'గౌరవనీయులైన ప్రధానమంత్రి గారూ 40 ఏళ్ల తర్వాత, ఇప్పుడు రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో శాంతి భద్రతలపై... ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర హక్కును కాలరాస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వివేకవంతంగా వ్వవహరిస్తారని, చరిత్ర పునరావృతం కాదని ఆశిస్తున్నా' అని రీట్వీట్ చేశారు.
in its capital city of Hyderabad may be infringed/trampled. Hope wisdom prevails and history does not repeat itself https://t.co/x9J82Qwb2Y
— KTR (@KTRTRS) June 25, 2015 Hon'ble PM,40 years later, speculation is rife that democratically elected Telangana state's right over Law&Order1/2 https://t.co/x9J82Qwb2Y
— KTR (@KTRTRS) June 25, 2015 గురువారం నగరాభివృద్ధికి కేంద్రం ప్రవేశపెట్టిన మూడు పథకాల ప్రారంభోత్సవంలోనూ మోడీ ఎమర్జెన్సీ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. జేపీ పిలుపుతో వేలాదిగా తరలివచ్చి ఎమర్జెన్సీని ధీటుగా ఎదుర్కొన్న ప్రజలను తలచుకోవడం గర్వంగా ఉందన్నారు.
‘చైతన్యవంతమైన, స్వతంత్రమైన ప్రజాస్వామ్యం ప్రగతికి కీలకం. ప్రజాస్వామిక విలువలను, సిద్ధాంతాలను పరిరక్షించడానికి మనం అన్ని ప్రయత్నాలు చేద్దాం' అని ఆయన అన్నారు. ‘భారత దేశ చరిత్రలో జూన్ 25, 26 తేదీలను ఎవరు కూడా మరిచిపోలేరు. 40 ఏళ్ల క్రితం దేశాన్ని ఎమర్జెన్సీ అనే సంకెళ్లతో బంధించి అధికార దాహం కారణంగా దాన్ని ఒక జైలుగా మార్చివేసారు' అని మోడీ అన్నారు.
‘40 ఏళ్ల క్రితం జేపీ సారథ్యంలో లక్షలాది మంది ప్రజలు ‘సంపూర్ణ క్రాంతి' నినాదంతో ఉద్యమించారు. పత్రికా కార్యాలయాలు మూతబడ్డాయి. రేడియో ప్రభుత్వ గొంతుకగా మారింది' అని ప్రధాని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. బీహార్‌లో జేపీ పుట్టిన ఊరిలో జాతీయ స్మృతి మందిరాన్ని నిర్మించనున్నామని, ఆ స్మృతి మందిరం ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతిఒక్కరికీ స్ఫూర్తినిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications