ఏం చెప్పారు: కెసిఆర్‌తో మోడీ
రాజేంద్రనగర్ లోని జాతీయ పోలీసు అకాడమీలో తన పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో మోదీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ బయలుదేరే ముందు ప్రధాని, సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా వివిధ అంశాలపై చర్చించారు. నల్లధనం నిర్మూలన చర్యల కారణంగా సామాన్యులు, రైతులు, చిన్న వ్యాపారులు, అసంఘటిత కార్మికులు ఇబ్బంది పడకుండా చూడాలని ప్రధానిని కోరారు.












Click it and Unblock the Notifications