కలెక్షన్ కింగ్‌కు బెదిరింపులు : జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద హల్‌చల్
హైదరాబాద్ : ప్రముఖ సినీ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ వద్ద హల్ చల్ చేశారు. తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. తన ఫిర్యాదు తీసుకొని, సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విదేశాల నుంచి కాల్స్
గతనెల 26 నుంచి వరుసగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని మోహన్ బాబు పేర్కొన్నారు. తన ఫిర్యాదు తీసుకొని బాధితులపై చర్యలు తీసుకోవాలన్నారు మోహన్ బాబు. మోహన్ బాబు ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు .. విదేశాలకు చెందిన ఫోన్ నంబర్లతో బెదిరింపు కాల్స్ వస్తున్నట్టు గుర్తించారు. ఈ కేసును లీగల్ సెల్ కు పంపించినట్టు పోలీసులు అధికారులు పేర్కొన్నారు.
వైవీఎస్ చౌదరి ఇష్యూ .. మోహన్ బాబు
ఇటీవల తనకు ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని వైవీఎస్ చౌదరి చేసిన ఫిర్యాదు మేరకు ఎర్రమంజిల్ కోర్టు మోహన్ బాబు ఏడాదికి శిక్ష విధించింది. తర్వాత మోహన్ బాబు బెయిల్ తీసుకొచ్చుకున్నారు. అయితే ఆ మరునాడే మోహన్ బాబు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిజంగానే అతనికి బెదిరింపు కాల్స్ వచ్చాయా ? అవి చేసింది ఎవరు ? అనే ప్రశ్నలకు పోలీసు విచారణలో జవాబు తేలనుంది.












Click it and Unblock the Notifications