కన్నా.. నువ్వు లేకుంటే బ్రతకలేను; కొడుకు మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య!!

ఆత్మహత్య చేసుకుని చనిపోయిన కొడుకు మీద ప్రేమతో ఓ తల్లి ప్రాణం తీసుకుంది. బావిలో దూకి ప్రాణాలు వదిలింది.

ఆ తల్లికి కొడుకు అంటే పిచ్చి ప్రేమ. కొడుకు లేకుంటే బ్రతకలేను అనుకుంది. ఇటీవల కొడుకు అకాల మరణంతో తీవ్ర మనస్థాపానికి గురైన తల్లి కన్నా నువ్వు లేకుంటే బ్రతకలేను అంటూ ప్రాణాలు తీసుకుంది. అత్యంత హృదయ విదారకంగా అనిపించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

కొడుకు ఆత్మహత్య .. కొడుకు లేకుండా బ్రతకలేనని తల్లి ఆత్మహత్య

కొడుకు ఆత్మహత్య .. కొడుకు లేకుండా బ్రతకలేనని తల్లి ఆత్మహత్య


జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన లక్ష్మీరాజం రాజగంగు దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు శివకుమార్ ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు కాగా కొడుకు చదువుకుంటున్నాడు. మూడు నెలల క్రితం చిన్న కారణానికే వరద కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మరణం నుండి ఆ తల్లి మానసిక క్షోభ అనుభవిస్తుంది. కొడుకు మృతితో తీవ్ర మనస్థాపానికి గురైన తల్లి మానసికంగా కృంగిపోయింది. కొడుకు లేకపోతే తాను బ్రతకలేకపోతున్నానని అనేకసార్లు బంధువులతో చెప్పింది. ఇక భర్త లక్ష్మీ రాజం కూడా ఉపాధి నిమిత్తం దుబాయ్ కి వెళ్ళిపోయాడు .

బావిలో దూకి ప్రాణం తీసుకున్న తల్లి

బావిలో దూకి ప్రాణం తీసుకున్న తల్లి

ఇంట్లో ఒంటరిగా ఉంటున్న రాజగంగు కొడుకును పదేపదే తలుచుకుంటూ తీవ్ర ఆవేదనకు లోనవుతుంది. కొడుకు జ్ఞాపకాలతో బాధ పడుతుంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. కొడుకు మీద ప్రేమతో ఆమె కూడా ప్రాణం తీసుకుంది. బావిలో దూకి ప్రాణాలు వదిలింది. ఆమె కుమార్తెలు ఫోన్ చేసినా ఫోన్ స్విచాఫ్ రావడంతో అనుమానం వచ్చి ఊరంతా వెతికారు. చివరకు ఊరికి పొలిమేరలో ఉన్న ఒక బావిలో రాజగంగు శవమై తేలింది.

కొడుకుపైన ప్రేమతో తల్లి కఠిన నిర్ణయం

కొడుకుపైన ప్రేమతో తల్లి కఠిన నిర్ణయం


విగత జీవిగా మారిన తల్లిని చూసి కూతుళ్లు బోరును విలపించారు. తమ్ముడి కోసం మమ్మల్ని అనాధలను చేసి వెళ్ళిపోయావా అంటూ దీనంగా విలపించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నప్పటినుంచి కొడుకు పైన విపరీతమైన ప్రేమతో ఉన్న తల్లి కొడుకు లేకుంటే జీవించలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తల్లి ప్రేమ కొడుకు మీద అంతగా ఉందని స్థానికులు అంటున్నారు. కొడుకే పిచ్చి పని చేశాడు అంటే తల్లి కూడా పిచ్చి పని చేసిందని కొందరు చెప్తున్నారు. మొత్తంగా ఈ ఘటనతో ఆత్మకూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+