• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమ్మ అన్నంత పనీ చేసింది: బావిలోకి తోసి పిల్లలను చంపేసి, తానూ...

|

వరంగల్: గత వారం రోజులుగా తనకు పిల్లలు భారమయ్యారని, వారిని చంపుతానని తరచూ తల్లి బెదిరించేది.. ఎందుకని భర్త ప్రశ్నిస్తే తనను కూడా చంపుతానని చెప్పేది.. మతి స్థిమితం సరిగా లేదని ఆసుపత్రిలో వైద్య సేవలందిస్తున్నా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు.

శనివారం అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి బావిలో వేయడంతో అక్కడిక్కడే మృతి చెందారు.. అనంతరం ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా రాయికుంటతండాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబాబాద్‌ మండలం వేంనూరు గ్రామ శివారు రాయికుంటతండాకు చెందిన బోడ పూల్‌సింగ్‌, లక్ష్మీపురానికి చెందిన సరితతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సందీప్‌ (6), సంధ్యన(3), గన్న(10నెలలు) ముగ్గురు సంతానం ఉన్నారు. తండాలో ఉపాధి లేకపోవడంతో పనుల కోసం పూల్‌సింగ్‌ కుటుంబమంతా హైదరాబాద్‌కు వలస వెళ్లారు. పూల్‌సింగ్‌ మోహినాబాద్‌లో ట్రాక్టరు నడుపుతూ జీవిస్తున్నాడు.

Mother kills children and attempts suicide

సరిత కొద్దిరోజులుగా మతి స్థిమితం సరిగా లేక బాధపడుతోంది. తరచూ పిల్లల్ని చంపుతానని బెదిరిస్తోంది. తాను ఇంటి వద్ద లేని సమయంలో పిల్లల్ని చంపుతుందని భావించిన పూల్‌సింగ్‌ శనివారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి వీరంతా రాయికుంటతండాకు చేరుకున్నారు. రాత్రి ఒక చోట సందీప్‌(6), సంధ్యన(3) నిద్రించారు. సరిత వద్ద పదినెలల బాబు గన్నా నిద్రించాడు. అర్థరాత్రి సరిత సంధ్యనను, గన్నలను తీసుకొని బయటకు వెళ్లింది. భర్త గమనించి బాత్‌రూంకు వెళ్లిందని భావించి నిద్రపోయాడు.

సరిత ఇద్దరు చిన్నారులను బావిలోకి తోసి తాను ఆత్మహత్యాయత్నం చేసింది. చాలాసేపటి వరకు రాకపోవడంతో పూల్‌సింగ్‌ అనుమానంతో సోదరుడు రాంసింగ్ కు విషయం చెప్పాడు. వీరిద్దరూ బయటకు వెళ్లి సరితను, ఇద్దరూ పిల్లల్ని పేరుతో పిలుస్తూ గాలించారు. తండా సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో అరుపులు వినిపించడంతో పూల్‌సింగ్ వెళ్లి బావిలో దూకాడు. అప్పటికే ఇద్దరు చిన్నారులు మృతిచెందారు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సరిత బావిలో మోటారు పైపును పట్టుకొని వేలాడుతోంది. పూల్‌సింగ్‌ మృతిచెందిన ఇద్దరు పిల్లల్ని బయటకు తీస్తుండగా కాళ్లతో నీటిలో ఉన్న భర్తను చంపాలని యత్నించి విఫలమైంది. అప్పటికే విషయం తెలుసుకున్న తండావాసులు బావి వద్దకు చేరుకొని పూల్‌సింగ్, సరిత, మృతి చెందిన పిల్లల్ని బయటకు తీశారు.

అభం శుభం తెలియని చిన్నపిల్లలు మృతి చెందడంతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. తన భార్య గత కొంత కాలంగా మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తోందని భర్త పూల్‌సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసునమోదు చేసినట్లు మహబూబాబాద్‌ రూరల్‌ సీఐ కృష్ణారెడ్డి తెలిపారు. రూరల్‌ ఎస్సై జితేందర్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

English summary
A woman, Saritha has killed her two children throwing them into a well and jumped into it in Mahaboobabad district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X