ముగ్గురు పిల్లల తల్లి ఇద్దరు యువకులతో ప్రేమాయణం.. జంటహత్యల కేసులో షాకింగ్ ట్విస్ట్!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సంక్రాంతి పండుగ వేళ చోటు చేసుకున్న జంట హత్యల కేసు కలకలం రేపింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో జంట హత్యలు చోటుచేసుకున్నాయి. కనీసం ముఖం కూడా గుర్తు పట్టని విధంగా ముఖాన్ని చితక్కొట్టి హత్య గావించారు. నిన్న అనంత పద్మనాభ స్వామి ఆలయ గుట్టల వద్ద పతంగులను ఎగరేయడానికి వెళ్ళినవారు శవాలను చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు.
జంట హత్యల కేసులో షాకింగ్ ట్విస్ట్
పోలీసులకు సమాచారం అందించడంతో జంట హత్యల కేసు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసులో షాకింగ్ ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీనే ఈ దారుణానికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన మహిళ చత్తీస్గఢ్ కి చెందిన బిందుగా గుర్తించారు . అలాగే మృతి చెందిన యువకుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంకిత్ సాకేత్ గా పోలీసులు గుర్తించారు.

ముగ్గురుపిల్లల తల్లి లవ్ ట్రాక్
అంకిత్ సాకేత్ హౌస్ కీపింగ్ పని చేస్తూ నానక్ రామ్ గూడాలో నివాసం ఉంటున్నాడు. ఇక బిందు కూడా హైదరాబాద్లోని వనస్థలిపురం నివాసం ఉంటుంది. బిందుకు ముగ్గురు పిల్లలు. బిందు భర్త చత్తీస్గడ్ లో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా అంకిత్ సాకేత్ తో బిందుకు ఉన్న పరిచయం అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ నెల మూడవతేదీన బిందు అదృశ్యమైనట్టు కుటుంబ సభ్యులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
పుప్పాల గూడా గుట్టల వద్దకు వెళ్ళిన ఇద్దరు
ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీన బిందును ఎల్బీనగర్ నుంచి నానక్ రామ్ గూడ కు కూడా సాకేత్ పిలిపించాడు. అక్కడ తన స్నేహితుడి రూంలో బిందుని ఉంచాడు.
అనంతరం ఇద్దరు మరుసటి రోజు పుప్పాలగూడ గుట్టల వద్దకు వెళ్లి అక్కడ ఏకాంతంగా గడిపారు. అయితే బిందు సాకేత్ తో మాత్రమే కాకుండా మరో యువకుడితో కూడా లవ్ ట్రాక్ నడిపినట్టుగా పోలీసులు గుర్తించారు.
బిందును, సాకేత్ ను హత్య చేసిన, బిందు లవ్ ట్రాక్ నడిపిన మరో యువకుడు
సాకేత్ మరియు బిందు కలిసి ఉండడాన్ని చూసిన ఆ యువకుడు కోపంతో బిందుని దారుణంగా హత్య చేసి, ఈ క్రమంలో పారిపోతున్న సాకేత్ ని కూడా వెంటాడి మరీ కిరాతకంగా హత్య చేసి ఉంటాడని, ఆపై ముఖాలు గుర్తుపట్టకుండా ముఖాలను బండరాయితో మోది చితక్కొట్టాడని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇక ఈ కేసులో మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications