ప్రియుడి మోజులో పడి పిల్లలపై తల్లి దారుణం: మర్మాంగాలపై వాతలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో ఓ కన్నతల్లి కొడుకు పట్ల కర్కశంగా ప్రవర్తించింది. అతనికి మర్మాంగాలపై వాతలు పెట్టింది. ఈ సంఘటన గురువారం వెలుగు చూసింది.

కొడుకు వయస్సు ఎనిమిదేళ్లు ఉంటుంది. అతనిని ఆ తల్లి చిత్రహింసలకు గురి చేసింది. బాలుడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

సంగారెడ్డికి చెందిన మురళీకృష్ణ అనే ఆటో డ్రైవర్‌తో పన్నెండేళ్ల క్రితం అనూషకు వివాహం జరిగింది. ఆ తర్వాత ఇరువురి మధ్య గొడవలు జరిగాయి.

Mother tortures 8 year old, dad approaches Police

అనూష విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. భర్తను ఇంటి నుంచి పంపించింది. అతనితో విడిపోయాక ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. అయితే ఇటీవల అనూషకు వివాహేతర సంబంధం ఏర్పడింది.

దీంతో పిల్లలపై విసుక్కోవడం, చిత్రహింసలకు గురిచేయడం, చివరికి మూత్రం కూడా తాగించి క్రూరత్వాన్ని చాటుకుందని తెలుస్తోంది. చెప్పిన మాట వినకపోతే ఒళ్లంతా వాతలు పెట్టేది.

ఆమె ఆగడాలు శృతిమించడంతో పిల్లలు తమ బాధను తండ్రి మురళీ కృష్ణకు చెప్పుకున్నారు. దీంతో ఆయన పిల్లలను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mother tortures 8 year old, dad approaches Police in Hyderabad on Thursday.
Please Wait while comments are loading...