కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్, బీజేపీ కీలక నేతలు: మోత్కుపల్లి, లలిత, దిలీప్, నేతి చేరిక
హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు కాంగ్రె్ పార్టీలో చేరగా.. మరికొందరు బీఆర్ఎస్, బీజేపీ నేతలు తాజాగా హస్తం గూటికి చేరారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీలు నేత విద్యాసాగర్ రావు, కపిలవాయి దిలీప్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
వీరితోపాటు పటాన్‌చెరుకు చెందిన బీఆర్ఎస్ నేత నీలం మధు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ ఖర్గు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇది ఇలావుండగా, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టీ సంతోష్ కుమార్ గురువారం రాత్రి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ నేతల చేరిక తమ పార్టీకి ఎంతో బలాన్నిస్తుందని కాంగ్రెస్ పేర్కొంది. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అవినీతి పాలనను తిరస్కరిస్తున్నారంటూ తెలిపింది.
A major boost for the Congress party ahead of the Telangana assembly elections.
— Congress (@INCIndia) October 27, 2023
Former minister Shri Motkupalli Narasimhulu, former MP Shri Komatireddy Rajagopal Reddy, former MLA Shri Yenugu Ravinder Reddy, former MLC Shri Nethi Vidyasagar, former MLC Shri Santosh Kumar, former… pic.twitter.com/7BegHiXkyo
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేది కాంగ్రెస్ పార్టీనేనని.. అందుకే ఈ పార్టీలో చేరినట్లు కపిలవాయి దిలీప్ కుమార్ తెలిపారు. అయితే, తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. కాగా, ఇంతకుముందు మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయమనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు నేతలు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications