• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ను జైలుకు పంపించే మొగోడా బండి సంజయ్.? మోడీనే అసలైన దేశ ద్రోహి అన్న మోత్కుపల్లి..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ నేతలపై గులాబీ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. బండి సంజయ్ నిన్ని గాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ధ్వజమెత్తారు. దేశాన్ని దోచుకున్న ఆరుగురు పారిశ్రామిక వేత్తల దగ్గర నుండి ముడుపులు దండుకుని వారిని దేశ సరిహద్దులు దాటించింది బీజేపి కాదా అని ప్రశ్నించారు. భారత దేశంలో అసలైన దేశ ద్రోహి ఎవరన్నా ఉన్నారా అంటే అది ప్రధాని నరేంద్ర మోదీ అని మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర ఆరోపణలు చేసారు.

బీజేపి అనుచిత వ్యాఖ్యలు సంహిచమన్న మోత్కుపల్లి

బీజేపి అనుచిత వ్యాఖ్యలు సంహిచమన్న మోత్కుపల్లి

చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా దళిత జాతి అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీసుకుంటున్న దళిత బంధు పథకాన్ని విమర్శించడం బీజేపి నేతలతో పాటు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తగదని పేర్కొన్నారు. దళితబంధు కావాలని డప్పు కొట్టారా? వద్దని డప్పుకొట్టారా.? స్పష్టత ఇవ్వాలని మోత్కుపల్లి డిమాండ్ చేసారు. బీజేపి పాలిత రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో ఐనా దళిత బంధు అమలు చేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. దళితులను అణచి వేసే పార్టీ ఏదైనా ఉందా అంటే బీజేపి మాత్రమేనని మోత్కుపల్లి నర్సింహులు వివరించారు.

దళిత బందు గురించి గందరగోళం సృష్టిస్తున్నారు..

దళిత బందు గురించి గందరగోళం సృష్టిస్తున్నారు..

దళిత జాతి అభివృద్ది కోసం మహనీయుడి రూపంలో చంద్రశేఖర్ రావు ఉద్బవించాడని, అలాంటి నాయకుడిని అడుగడుడునా విమర్శించడం సరికాదని మోత్కుపల్లి మండిపడ్డారు. సీఎం చంద్రశేఖర్ రావును టచ్ చేసే సాహసం బండి సంజయ్ చేస్తే దళితులు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. దళితుల గురించి, దళిత బంధు గురించి దళతి జాతిలో కావాలనే గందరగోళాన్ని సృష్టిస్తున్నారని బీజేపి నేతలపై మోత్కుపల్లి ధ్వజమెత్తారు. సీఎం చంద్రశేఖర్ రావు అమలు చేస్తున్న దళిత బందు ను వ్యతిరేకించినా, సీఎం ను విమర్శించినా సహించేది లేదని, తరిమికొడతామని బీజేపి నేతలను హెచ్చరించారు. దేశంలో బీజేపి ప్రభుత్వం ఓడిపోతే అందుకు కారణం కూడా బండి సంజయ్ కారణమవుతాడని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదే అసలైన దేశ ద్రోహి..

ప్రధాని నరేంద్ర మోదే అసలైన దేశ ద్రోహి..

అంతే కాకుండా దేశాన్ని దోచుకున్న ఆరుగురు పారిశ్రామిక వేత్తలనుండి ముడుపులు దండుకుని వారిని దేశ సరిహద్దులు దాటించింది కూడా బీజేపి నేతలు మాత్రమే నని సంచలన వ్యాఖ్యలు చేసారు. నల్లధనం వెనక్కు తెచ్చి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు ఇస్తానని పచ్చి మోసం చేసిన పార్టీ బీజేపి మాత్రమేనని మండి పడ్డారు. దేశ వ్యాప్తంగా దళిత బంధు అమలు చేసే సత్తా బీజేపి పర్టీకి ఉందా అని ప్రశ్నించారు.

ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను నిలువెత్తున మోసం చేసారని కేంద్రప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పెట్రోల్ డిజిల్ ధరలను రోజూవారీగా పెంచి సామాన్యుడు నడ్డి విరుస్తుంది బీజేపి ప్రభుత్వం కాదా.?ఇందుకు బండి సంజయ్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అచ్చే దిన్ తర్వాత ముందు సచ్చే దిన్ వచ్చిందని మోత్కుపల్లి ఎద్దేవా చేసారు.

కేసీఆర్ ను టచ్ చేసే సత్తా సంజయ్ కు లేదు..

కేసీఆర్ ను టచ్ చేసే సత్తా సంజయ్ కు లేదు..

సీఎం చంద్రశేఖర్ రావును జైలుకు పంపించే సామర్ధ్యం బీజేపికి గాని, బండి సంజయ్ గానీ ఉందా అని ప్రశ్నించారు. చంద్రశేఖర్ రావును జైలుకు పంపిస్తే చేతులు కట్టుకుని చూస్తూ ఊర్కోమని హెచ్చిరించారు. తెలంగాణ సంపూర్ణ అభివృద్దికి ప్రణాళికలు రచిస్తున్న సీఎం పై రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. సీఎం చంద్రశేఖర్ రావు దళితుల కోసం ఓ పవిత్ర యజ్ఞం చేస్తుంటే దాన్ని భగ్నం చేసి రాజకియ ప్రయోజనం పొందాలని చూస్తే బీజేపి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మోత్కుపల్లి హెచ్చరించారు. రాబోవు రోజుల్లో దళితులందరూ ఏకమై బీజేపి నేతలపై తిరగబడతారని మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు.

English summary
Trs party leader Motkupalli Narsimhulu was angry with the Bharatiya Janata Party leaders. Bandi Sanjay has come into politics in little and flagged that it is not reasonable to make indecent remarks on Chief Minister Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X