బండి Vs ఈటల, స్ట్రైట్ ఫైట్ - కీలక మలుపు..!!
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తిరిగి బండి సంజయ్ - ఈటల మధ్య పోరు తెర మీదకు వచ్చింది. డైలాగ్ వార్ కొనసాగుతోంది. హుజూరాబాద్ కేంద్రంగా బండి చేసిన వ్యాఖ్యలకు ఈటల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక.. స్ట్రీట్ ఫైట్ ఉండదని.. స్ట్రైట్ ఫైట్ మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పారు. శత్రువుతో కొట్లాడవచ్చు కానీ కడుపులో కత్తులు పెట్టుకొనే వారితో పోరాటం చేయలేమంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇద్దరు ముఖ్య నేతల మధ్య వివాదం తాజాగా కొత్త మలుపు తీసుకుంది.
బీజేపీ నేతలు బండి సంజయ్ - ఈటల రాజేందర్ మధ్య వివాదాలు మరో సారి బయట పడ్డాయి. తాజాగా బండి సంజయ్ హుజురాబాద్‌లో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శామీర్‌పేట్‌లోని ఈటల రాజేందర్ ఇంటికి ఇవాళ(శనివారం) కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఆ సమయంలో ఈటల కీలక వ్యాఖ్యలు చేసారు. హుజురాబాద్ తెలంగాణ ప్రతీకకు అడ్డా అని ఉద్ఘాటించారు.

ఇక నుంచి అక్కడ స్ట్రైట్ ఫైట్ ఉంటుందని.. స్ట్రీట్ ఫైట్ మాత్రం ఉండదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలను దాటి తాను ముందుకు వచ్చానని చెప్పుకొచ్చారు. అప్పుడు కేసీఆర్ తన విషయంలో చేసింది అదేనని గుర్తుచేశారు. అయినా హుజురాబాద్ బిడ్డలు తనను కాపాడుకున్నారని ఉద్ఘాటించారు. తాను అలాగే వారిని కాపాడుకుంటానని మాటిచ్చారు. శత్రువుతో కొట్లాడవచ్చు కానీ కడుపులో కత్తులు పెట్టుకొనే వారితో పోరాటం చేయలేమని విమర్శించారు.
బీజేపీలో అన్నిరకాల అంశాలని పరిగణనలోకి తీసుకుంటారనే ఈ పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు. తెలంగాణలో తాను తొక్కని ఇంటి గడప లేదని.. తనకు తెలియని వారు లేరని... బీసీ బిడ్డగా తాను మంత్రి పదవులు పొందానని గుర్తుచేశారు. దేశ ప్రధాని మోదీ వ్యక్తుల కోసం కాకుండా.. వ్యవస్థ నిర్మాణం కోసం పని చేస్తున్నారని నొక్కిచెప్పారు.
మనమంతా దేశ ధర్మం కోసం కట్టుబడి పని చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో కొంతమంది ఉంటారని.. వారు ఇతరులను ఎదగనివ్వు కుండా చేయడమే వాళ్ల పని అని ఈటల విమర్శించారు.కచ్చితంగా హుజురాబాద్ వస్తా.. మీ వెంట ఉంటానని హామీ ఇచ్చారు. తనను ఏడుసార్లు గెలిపించారని... ఎవరికీ భయపడేది లేదని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications