కవిత స్టైల్: సమస్యలు నోట్ చేసుకుని, విడివిడిగా జవాబులిచ్చారు

కరీంనగర్: లోకసభకు గెలిపించిన ప్రజల ఆశలను వమ్ముచేయకుండా ప్రతి సమస్యను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషిచేస్తానని, ప్రజల రుణం తీర్చుకునేందుకే మన పల్లె-మన ఎంపీ కార్యక్రమాన్ని చేపట్టానని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. వీలైనంత మేరకు అన్ని గ్రామా ల్లో పర్యటించేందుకు ప్రణాళిక తయారుచేసుకున్నట్లు తెలిపారు.

వచ్చి వెళ్లడంతోనే సరిపెట్టకుండా సమస్యల పర్కిష్కారం ఎంత వరకు వచ్చిందో ఎప్పటికప్పు డు పరిశీలించి చర్యలు తీసుకుంటానని చెప్పారు. క్షేత్రస్థాయిలో పల్లెల్లో సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలన్న లక్ష్యంతో ఎంపీ కవిత సోమవారం కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం చల్‌గల్ లో మన ఎంపీ-మన పల్లె కార్యక్రమం చేపట్టారు.

 MP Kavitha hears the problems public

అంతకు ముందు పలువాడల్లో తిరిగారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకడంతోపాటు ఆప్యాయంగా ఇంటికి రావాలని ఆహ్వానించారు. అనంతరం సభలో గ్రామస్తులకు సమస్యలు చెప్పేందుకు ఎంపీ అవకాశం ఇచ్చారు. సమస్యలన్నింటినీ నోట్‌చేసుకుని విడివిడిగా సమాధానం చెప్పారు. రోడ్లు, మురుగునీటి కాల్వలు, క్రీడా మైదానం, మహి ళా భవన్, లైబ్రరీ, రెండు కులసంఘాలకు కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటుకు నిధులు మంజూ రు చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.

శ్మశానవాటికల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తర్వాత పలు అభివృ ద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం నర్సింగాపూర్‌లో మన పల్లె- మన ఎంపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి అక్కడే బస చేశారు.

కార్యక్రమాల్లో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, టీఆర్‌ఎస్ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్, టీఆర్‌ఎస్ నాయకులు జితేందర్‌రావు, రాజేశం గౌడ్, బండ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+