ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత: రాజ్‌నాథ్‌తో కవిత
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం కేసులను ఎత్తివేసింది. ఈ మేరకు న్యాయశాఖ సోమవారం 30 ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి విముక్తి కల్పిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసుల ఎత్తివేత ప్రక్రియ అక్టోబర్ చివరికల్లా పూర్తయ్యే అవకాశం ఉంది.
అమరుల కుటుంబాలకు సాయం
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్లు గుర్తించిన 459 కుటుంబాలకు సాయం అందించాలని ఆదేశాలు ఇచ్చింది. ఆర్థిక సాయానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలిచ్చింది.
రాజ్‌నాథ్‌ను కలిసిన ఎంపి కవిత

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను టిఆర్ఎస్ ఎంపి కవిత కలిశారు. రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశ అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల విభజన త్వరతగతిన పూర్తి చేయాలని రాజ్‌నాథ్‌ను కోరినట్లు చెప్పారు. రాష్ట్ర సమస్యలపై కూడా చర్చించానని చెప్పారు.
ఇది ఇలా ఉండగా ఉద్యోగుల విభజనకు ఏపి ప్రభుత్వం సహకరించాలని మంత్రి హరీశ్ రావు కోరారు. ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పని చేయాలన్నారు. తెలంగాణ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు పని చేయాలని హరీశ్ రావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేందుకు ఉద్యోగుల సహకారం అవసరమని చెప్పారు.
దాశరథి కృష్ణమాచార్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హామీ మేరకు దాశరథి కృష్ణమాచార్య తనయుడికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది. దాశరథి లక్ష్మణాచార్యను ఐటి శాఖలో నెట్‌వర్క్ ఇంజినీర్‌గా ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు నియామక పత్రం అందజేశారు.












Click it and Unblock the Notifications