పేద్ద.. అభిమానిని: మెగాస్టార్‌తో ఎంపీ కవిత సెల్ఫీ
టాలీవుడ్ మెగాస్టార్, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు చిరంజీవితో టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ కవిత సెల్ఫీ దిగారు.
న్యూఢిల్లీ: టాలీవుడ్ మెగాస్టార్, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు చిరంజీవితో టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ కవిత సెల్ఫీ దిగారు. అంతేగాక, సెల్ఫీ విత్ మెగాస్టార్ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు కవిత. తాను మెగాస్టార్‌కు అభిమానినంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. దీంతో ఆ పోస్టుకు లైకులు, కామెంట్లు విపరీతంగా వస్తున్నాయి.
కాగా, శనివారం ఉదయం నుంచీ ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో లోక్సభ, రాజ్యసభ ఎంపీలంతా ఓట్లు వేయడానికి పార్లమెంట్‌కు చేరుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి, టీఆర్ఎస్ ఎంపీ కవిత కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Fan moment 😊 with #megastar during Vice Presidential voting in the parliament pic.twitter.com/KeqLSZLjiz
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 5, 2017
ఆ తర్వాతే చిరంజీవితో ఎంపీ కవిత ఫొటో దిగి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. కాగా, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పోటీలో ఉండగా, విపక్షాల అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ బరిలో ఉన్న విషయం తెలిసిందే. మెజార్టీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వెంకయ్యనాయుడే ఉపరాష్ట్రపతిగా గెలుపొందే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications