ప్రధాని మోదీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ - డెసిషన్ టైం..!!
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడుగులు ఎటు. ఢిల్లీ కేంద్రంగా ఎంపీ వెంకటరెడ్డి కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. మునుగోడు బై పోల్ తో ఎంపీ వెంకటరెడ్డి ని రేవంత్ వర్గం కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. వెంకటరెడ్డి తనకు పార్టీ కంటే తమ్ముడి గెలుపు ముఖ్యం అనే విధంగా వ్యవహరించారు. ప్రచారానికి దూరంగా ఉన్నారు. రాహుల్ యాత్రకు హాజరు కాలేదు. దీంతో, వెంకటరెడ్డికి పార్టీ పదవుల్లో ఎక్కడా స్థానం దక్కలేదు. దీంతో, ఇప్పుడు వెంకటరెడ్డి ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. నిన్న ఏఐసీసీ అధినేత మల్లిఖార్జున ఖర్గేతో సమావేశమైన వెంకటరెడ్డి..ఇప్పుడు ప్రధానితో భేటీ ద్వారా కాంగ్రెస్ కు పెద్ద పజిల్ గా మారుతున్నారు.

ప్రధానితో వెంకటరెడ్డి భేటీ ఖరారు
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ మేరకు రెండు రోజులుగా అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్న వెంకటరెడ్డికి రేపు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు ప్రధాని అప్పాయింట్ మెంట్ ఖరారు అయింది. పూర్తిగా నల్గొండ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రధాని అప్పాయింట్ మెంట్ కోరారాని వెంకటరెడ్డి సహచరులు చెబుతున్నారు. అందులో మసీ నదీ ప్రాంత అభివృద్ధి తో పాటుగా, ఎంఎంటీఎస్ విస్తరణ.. అదే విధంగా జిల్లాలో జాతీయ రహదారుల పైన ప్రధానికి వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. గతంలోనూ కోమటిరెడ్డి ప్రధానితో భేటీ అయ్యారు. కానీ , ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు రేవంత్ వర్సస్ కోమటిరెడ్డి మధ్య సాగుతున్న రాజకీయం ఈ భేటీ పైన ఆసక్తిని పెంచుతోంది.

అటు ఖర్గేతో..ఇటు ప్రధానితో వరుసగా
ఏఐసీసీ చీఫ్ తో ఢిల్లీలో ఎంపీ వెంకటరెడ్డి సమావేశమయ్యారు. సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. టీపీసీసీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించారు. టీపీసీసీ బాధ్యతలు చూస్తున్న వారి కారణంగానే సమస్యలు వస్తున్నాయని ఖర్గేకు వివరించినట్లుగా తెలుస్తోంది. పార్టీ నుంచి సీనియర్లు వెళ్లిపోవటం.. పార్టీలో కొనసాగుతున్న నైరాశ్యం గురించి వెంకటరెడ్డి నివేదిక రూపంలో ఖర్గేకు ఇచ్చారని సమాచారం. పార్టీని సీనియర్లు వీడటం పైనా ఖర్గే ఆరా తీసినట్లు తెలుస్తోంది. కమిటీల నియామకం పైన నేతల నుంచి వస్తున్న స్పందనలు..రాజీనామాల పైన చర్చ జరిగింది. అయితే, ఈ కమిటీ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని చెబుతున్నారు. నేతలు గాంధీ భవన్ లో అందుబాటులో ఉండటం లేదని వెంకటరెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

వెంకటరెడ్డి డిసైడ్ అయిపోయారా
దాదాపు మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ లో ఉన్న వెంకటరెడ్డికి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా అనే చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో నల్గొండ నుంచే పోటీ చేస్తానని ప్రకటించిన వెంకటరెడ్డి ఏ పార్టీ నుంచి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వటం లేదు. అదే సమయంలో సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లటంతో, వెంకటరెడ్డి కూడా వెళ్తారంటూ ఒక వర్గం ప్రచారం చేసింది. మునుగోడు ఉప ఎన్నికల ఫలితా తరువాత వెంకరెడ్డి దూకుడు తగ్గింది. అయితే, ఢిల్లీ కేంద్రంగా తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికిప్పుడు వెంకటరెడ్డి పార్టీ మార్పు నిర్ణయం ఉండే అవకాశం లేదు. ఎన్నికల సమయానికి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో, ఇప్పుడు వెంకటరెడ్డి ఢిల్లీ కేంద్రంగా చేస్తున్న రాజకీయం ఆసక్తిగా మారుతోంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications