తెలంగాణలో ఎన్డీఏ - బీజేపీతో టీడీపీ, బీఆర్ఎస్ దోస్తీ..!!
తెలంగాణ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. రేవంత్ ప్రభుత్వం పైన బీజేపీ, గులాబీ పార్టీలు కొత్త వ్యూహాలతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలు ఒకటేనంటూ కొంత కాలంగా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. తాజాగా కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసుల వెనుక బీజేపీ - కాంగ్రెస్ ఉన్నాయని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అయితే, తాజాగా మరో సంచలన సమీకరణ తెలంగాణ రాజకీయాల్లో తెర మీదకు వచ్చింది. ఇప్పుడు అదే రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.
ఏపీలో టీడీపీ, జనసేనతో జత కట్టిన బీజేపీ ఎన్డీఏ కూటమిగా అధికారంలోకి వచ్చింది. తెలంగాణ లోనూ ఎన్డీఏ విస్తరణ దిశగా బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కొంత కాలంగా ప్రచారం జరుగు తోంది. అయితే, ఎన్డీఏ విస్తరణ పైన బీజేపీ.. టీడీపీ నేతలు స్పందించ లేదు. టీడీపీ మాత్రం తిరిగి తెలంగాణలో బలం పెంచుకునేలా కొత్త కార్యాచరణ సిద్దం చేస్తోంది. ఇక, ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత.. ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి.

ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా కాంగ్రెస్ తెలంగాణలో తిరిగి అధికారంలోకి వస్తుందని మల్లు రవి ధీమా వ్యక్తం చేసారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులకు తమకు సంబంధం లేదని మల్లు రవి స్పష్టం చేసారు. కేసీఆర్ రాజ్యాంగానికి అతీతుడు కాదని వ్యాఖ్యానించారు. కేసీఆర్, హరీష్, ఈటెల కమిషన్ ముందు హాజరు కావాలని సూచించారు. గతంలో పలువురు ముఖ్యమంత్రులు కేసులు వస్తే ఎదుర్కున్నారని.. జైలుకు వెళ్లారని గుర్తు చేసారు.
విద్యుత్ కమిషన్ విషయంలో కేసీఆర్ తప్పు చేసారని.. ఇప్పుడు కాళేశ్వరం విచారణకు సహకరించాలని రవి పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయని. ప్రజా మద్దతు ఉన్న ప్రభుత్వాన్ని ఏం చేయలేరని వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వం కొనసాగటం తో పాటుగా తిరిగి అధికారంలోకి వస్తుందని రవి ధీమా వ్యక్తం చేసారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications