Balagam: బలగం వేణుపై ఫిర్యాదు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్..
మానవ సంబంధాలపై చాలా చక్కగా తెరకెక్కించిన చిత్రం బలగం.. ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ మొగిలయ్య, కొమురమ్మ కలిసి పాడిన పాట ప్రతీ ఒక్కరి కంటతడి పెట్టించింది. అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఎలా ఉండాలో మొగిలయ్య, కొమురమ్మ చాలా చక్కగా వివరించారు. ఈ చిత్రానికి కమెడియన్ వేణు దర్శకత్వం వహించారు. బలగం చిన్న సినిమా అయినా ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం దిల్ రాజుకు మంచి పేరును కూడా తెచ్చింది.
ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంతటి గొప్ప సినిమాను తీసిన దర్శకుడు వేణుపై కొంత మంది అధికారులకు ఫిర్యాదు చేశారు. వేణుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. బలగం సినిమాలో కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల ఎంపీటీసీలు చెబుతున్నారు. ప్రజాప్రతినిధులైన మమ్మల్ని కించపరిచే విధంగా తీసిన సన్నివేశాలు చాలా బాధించాయని తహసీల్దార్ మహేశ్వరను కలిసి వినతిపత్రం ఇచ్చారు.

బలగం సినిమాలో ఎంపీటీసీలను కించపరిచేలా ఉన్న సీన్లను తొలగించి దర్శకుడు వేణుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీలు డిమాండ్ చేశారు. కాగా ఈ సినిమా చివరలో పాట పాడిన మొగిలయ్య ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. మొగిలయ్యను అనారోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నాయి. మొగిలయ్యకు కళ్లు కూడా సరిగా కనబడడం లేదు. బలగం సినిమాలో తన పాటతో కోట్లాది మంది హృదయాలను కదిలించిన మొగిలయ్య, కొమురమ్మ దంపతుల నిజ జీవిత గాథ అందరని కదిలిస్తోంది.
పస్తం మొగిలయ్య స్వస్థలం వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామం. మొగిలయ్య దంపతులు ఊరూరా తిరుగుతూ కథలను గానం చేస్తూ ఉపాధి పొందేవారు. వీరిని చూసిన బలగం సినిమా డైరెక్టర్ వేణు బలగం సినిమా క్లైమాక్స్ లో వీరి పాటతో పాటు నంటించే అవకాశం కల్పించారు. సినిమా చివరలో వీరు చేసిన కథా గానం చిత్రానికి హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం వరంగల్ లోని సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మొగిలయ్య.. కిడ్నీ వ్యాధితో పాటు ఆయనకు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో మెుగిలయ్యను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.












Click it and Unblock the Notifications