జయప్రద ఇంటికొచ్చా, రాజకీయాల కోసం మళ్లీ హైదరాబాద్ వస్తా: ములాయం
హైదరాబాద్: తాను పెళ్లి మాజీ ఎంపీ జయప్రద తనయుడి పెళ్లి విందు కోసం వచ్చానని అందుకే రాజకీయాలు మాట్లాడదల్చుకోలేదని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆదివారం నాడు అన్నారు.
ప్రముఖ సినీ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద తనయుడు సిద్ధార్థ - ప్రవల్లికా రెడ్డిల వివాహ విందు హైదరాబాదులో ఆదివారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి ములాయం సింగ్‌తో పాటు అమర్ సింగ్ తదితరులు హాజరయ్యారు.

హైదరాబాద్‌కు వచ్చిన ములాయంను మీడియా చుట్టుముట్టింది. బీహార్ ఎన్నికల ఫలితాలు, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రశ్నలు అడిగింది. అయితే పెళ్లి విందుకు వచ్చిన తాను రాజకీయాలు మాట్లాడనని తేల్చి చెప్పారు.రాజకీయాలు మాట్లాడేందుకు త్వరలోనే తాను మరోసారి హైదరాబాద్ వస్తానని వ్యాఖ్యానించారు.
జయప్రద ఇంట్లో శుభకార్యానికి రావడం ఆనందంగా ఉందని ములాయం సింగ్ చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం జయప్రద ఇంటికి వచ్చిన ములాయం, అమర్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం రాత్రి తిరిగి లక్నో వెళ్లారు.












Click it and Unblock the Notifications