మునావర్ ఫారూఖీ షో రగడ: ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్; షో రద్దు చేస్తారా?
స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ షో కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మునావర్ ఫారూఖీ షోను అడ్డుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. గతంలోనే కమెడియన్ మునావర్ ఫారూఖీ షో ను అడ్డుకుంటామని, వస్తే కొట్టి పంపిస్తామని, షో జరిగే ప్రదేశాన్ని తగలబెడతామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ షోకు అనుమతించవద్దని హెచ్చరికలు జారీ చేశారు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్. తాజాగా మరోమారు మునావర్ ఫారూఖీ షోను అడ్డుకుంటామని, బిజెపి కార్యకర్తలు ఆన్లైన్లో టికెట్లు తీసుకున్నారని, కచ్చితంగా దాడి చేసి తీరుతామని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఎమ్మెల్యే రాజా సింగ్ హౌస్ అరెస్ట్
ఇక ఈ షోను అడ్డుకుంటామని ప్రకటించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా రాజాసింగ్ ను అరెస్టు చేస్తామని గోషామహల్ పోలీసులు చెబుతున్నారు. హిందూ దేవతలను అవమానించిన మునావర్ ఫారూఖీ షో ను ప్రభుత్వం ఆపకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని రాజాసింగ్ తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం రాజాసింగ్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు.

మాదాపూర్ డీసీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలు
ఇక మాదాపూర్లోని డిసీపి కార్యాలయం దగ్గర కూడా పోలీసులు సెక్యూరిటీని టైట్ చేశారు. ఫారూఖీ షో లో దాడి జరిగితే దానికి మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని రాజా సింగ్ తేల్చి చెప్పారు. తన వల్ల ఇప్పటి వరకు ఎక్కడా శాంతిభద్రతల సమస్య రాలేదని, తనను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని రాజాసింగ్ ప్రశ్నిస్తున్నారు. ధర్మం కన్నా తనకు పార్టీ ముఖ్యం కాదని పేర్కొన్న ఆయన హిందూ దేవుళ్లను కించపరిచే వారి కామెడీ షో లకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుందో చెప్పాలంటూ మండిపడుతున్నారు.

బీజేపీ వద్దన్నా సరే మునావర్ ను వదిలేది లేదన్న రాజా సింగ్, అనుమతిపై సందిగ్ధం
బిజెపి నాయకులు వద్దన్నా సరే తాను అడ్డుకుని తీరుతా అని తేల్చి చెబుతున్నారు రాజాసింగ్. ఇదిలా ఉంటే హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో శనివారం రోజు మునావర్ ఫారూఖీ షో జరగాల్సి ఉండగా పదిహేను రోజుల క్రితమే ఈ కామెడీ షోకు నిర్వాహకులు అనుమతి తీసుకున్నారు. అయితే అనుమతి పత్రంలో మునావర్ ఫారూఖీ పేరును పేర్కొనలేదు. దీంతో పోలీసులు అనుమతి ఇచ్చారు.ఇప్పుడు అదే రాజా సింగ్ ఆగ్రహానికి కారణంగా మారింది.

షో అనుమతి రద్దు అంశాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
అనుమతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మునావర్ ఆ షోలో పాల్గొంటున్నట్టు తెలిసిందని, దీనిపై విచారణ జరుపుతున్నామని, అన్ని అంశాలపై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతనే కామెడీ షో పై తుది నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇక తాజాగా రాజాసింగ్ హెచ్చరికల నేపథ్యంలో రాజాసింగ్ ను హౌస్ అరెస్ట్ చేయడంతో పాటుగా, మునావర్ ఫారూఖీ షో ను పూర్తిగా రద్దు చేసే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications