తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోరు: కరోనా హోరు..ప్రచారాల జోరు..ప్రజలు బేజారు!!
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గ్రేటర్ వరంగల్,ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు, సిద్ధిపేట, అచ్చంపేట ,జడ్చర్ల కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న వేళ కరోనా నిబంధనలను తుంగలో తొక్కి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు అభ్యర్థులు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మాస్కులు ధరించి ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని చెప్తున్నా, సామాజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా ప్రచారానికి తిరగడంతో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతుంది అన్న అనుమానం వ్యక్తమవుతుంది.

జోరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం ... కరోనా భయంతో జనం
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా జరుగుతున్న రోడ్ షోలు,ర్యాలీ లలో సైతం జనాలు గుంపులుగా పాల్గొంటున్నారు. ఈ పరిస్థితులు గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లలో కరోనా వ్యాప్తిని మరింత పెంచుతున్నాయన్న భావన వ్యక్తమవుతుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతూ అభ్యర్థులను ఇళ్లకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నా,అభ్యర్థులు అవేవి పట్టించుకోకుండా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను ఇచ్చి వెళుతున్నారు.

ఎన్నికలు జరుగుతున్న నగరపాలక సంస్థలలోనూ , మున్సిపాలిటీలలోనూ పెరుగుతున్న కేసులు
ఈ పరిస్థితులు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లలోని ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. అసలే మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఆసుపత్రులలో బెడ్లు కొరత, ఆక్సిజన్ కొరత నెలకొంది.చాలా ఆసుపత్రులలో ఐసియూలు ఖాళీ లేవు. కరోనా బారినపడి ఆసుపత్రికి వెళితే ఆసుపత్రులలో దోపిడీ పర్వం అంతా ఇంతా కాదు.ఈ పరిస్థితులు గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను గందరగోళంలో పడేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్న వేళ ఓటు వేయడానికి ఎలా వెళ్లాలి అన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.

పోలింగ్ శాతంపై కరోనా ప్రభావం పడే అవకాశం .. ఎన్నికలపై ఆసక్తి లేని ఓటర్లు
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ శాతం ఎప్పుడూ తక్కువగా నమోదు అవుతుంది. ప్రతిసారి ఎక్కువ పోలింగ్ శాతం నమోదు చేయడం కోసం అధికార యంత్రాంగం విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అయితే ఈ ఏడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజలు ఎన్నికలపైన ఆసక్తి చూపించడం లేదు. దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న సమయంలో ప్రజల్లో ఎన్నికలపై ఆసక్తి లేదు. ఓటు వెయ్యాలి అన్న భావన కూడా చాలా మంది ప్రజల్లో కనిపించకపోవడం గమనార్హం . ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎందుకు ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నట్లు అని ప్రశ్నిస్తున్న వారు కూడా లేకపోలేదు.

మంత్రులు , రాష్ట్ర స్థాయి నాయకుల ప్రచారం , రోడ్ షో లలో గుంపులుగా జనాలు
ఇవన్నీ పక్కనపెట్టి అధికార, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఒకరిని మించి ఒకరు దూకుడు పెంచి ప్రచార పర్వాన్ని జోరుగా సాగిస్తున్నారు. గ్రేటర్ పోరును రసవత్తరంగా మారుస్తున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులు, మంత్రులు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున సాగిస్తున్న ప్రచార పర్వం కరోనా వ్యాప్తికి కారణమవుతుంది అన్న భావన అధికార యంత్రాంగంలో ఉన్నప్పటికీ, ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో ఏమీ చేయలేని పరిస్థితి.మరోపక్క అధికార యంత్రాంగానికి సైతం ఎన్నికలను నిర్వహించడానికి భయాందోళన నెలకొంది.

ఎన్నికల నిర్వహణాధికారులకు కరోనా భయం ..ఎన్నికల నిర్వహణ కత్తిమీద సామే
కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ఎన్నికలను నిర్వహించడం అటు అధికారులకు సైతం కత్తిమీదసామే .కక్కలేక మింగలేక అధికారులు ఎన్నికల ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్ జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి . అధికారిక లెక్కల కంటే కూడా అనధికారిక లెక్కల ప్రకారమే ఎక్కువ కేసులు ఉన్నాయి. విపరీతమైన మరణాలు సంభవిస్తున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పరిస్థితి అదే విధంగా ఉంది. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న మిగతా మున్సిపాలిటీల పరిస్థితి అదే.

మున్సిపల్ ఎన్నికలు .. అందరికీ తెచ్చాయి తిప్పలు .. అభ్యర్థుల్లోనూ కరోనా టెన్షన్
ఈ సమయంలో ఎన్నికలపై ప్రజల్లో ఆసక్తి కానీ, ఓటు వేయాలన్న భావన కానీ కలగకపోవడం గమనార్హం. ప్రజల ఆసక్తిని గుర్తించకుండా ఎన్నికల సంఘం ఏర్పాటు చేయడం, అభ్యర్థులు ప్రచారాలకు జోరుగా తిరుగుతుండటం ఎంతైనా రెండు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని నగరవాసులకు ఇబ్బందికర పరిణామం.అటు అభ్యర్థులు ఒకపక్క కరోనా భయాన్ని మనసులో పెట్టుకుని ఎన్నికల ప్రచారాలని సాగిస్తూ ఉండటం గమనార్హం .
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications