మునుగోడులో 'శ్రీమంతుడు మహేష్ బాబు'... తిరిగివ్వకపోతే లావైపోతారు?

మునుగోడు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. గెలిస్తేనే నిలవగలుగుతామని గుర్తించిన భారతీయ జనతాపార్టీ తన సర్వశక్తులు ఒడ్డుతోంది. సిట్టింగ్ స్థానం కాబట్టి ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్, అధికార పార్టీకే ప్రజల మద్దతంటూ టీఆర్ఎస్ హోరాహోరీగా ఢీకొంటున్నాయి.

తిరిగివ్వకపోతే లావైపోతాం!

తిరిగివ్వకపోతే లావైపోతాం!

మహేష్ బాబు కథానాయకుడిగా వచ్చిన చిత్రం శ్రీమంతుడు. ఈ చిత్రంలో కథానాయకుడు ఒక ఊరిని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తారు. ఈ అంశాన్ని స్ఫూర్తిగా తీసుకున్న పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఆ అంశాన్ని ఫాలో అవుతున్నారు. ఎవరికి వారుగా ఇక్కడ మండలాలను, గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కు హాజరైన మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామనని ప్రకటించారు. టీఆర్ఎస్ తమకు ఎంతో ఇచ్చిందని.. తిరిగి పార్టీకి ఎంతో కొంత ఇవ్వాలనే ఉద్దేశం ఉండటంతో దత్తత తీసుకుంటానన్నారు.

దత్తతకు సంబంధించి మంత్రుల ఆఫర్లు!

దత్తతకు సంబంధించి మంత్రుల ఆఫర్లు!

మరో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చండూరు మున్సిపాలిటీని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ఎర్రబెల్లి దత్తత తీసుకొని చండూరును గెలిపించాలంటూ ఉప ఎన్నికల్లో చండూరు నుంచి టీఆర్ఎస్ కు మెజారిటీ రావాల్సి ఉంటుంది. అలాగే మంత్రి మల్లారెడ్డి కూడా చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. అయితే ఆరెగూడెం నుంచి కూడా మెజారిటీ రావాల్సి ఉంటుంది. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని.. ఆయన మీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానంటున్నారని, ఇటువంటి అవకాశాన్ని వదులుకోవద్దంటూ మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు.

బీజేపీ నేతల మండిపాటు

బీజేపీ నేతల మండిపాటు

అయితే మంత్రుల దత్తత ప్రకటనపై భారతీయ జనతాపార్టీ నేతలు మండిపడుతున్నారు. వీరంతా దత్తత తీసుకోవడానికి మునుగోడు నియోజకవర్గ ప్రజలేమైనా అనాథలా అంటూ ప్రశ్నిస్తున్నారు. గెలవలేమనే నమ్మకం వారికుందని, అందుకే దత్తత డ్రామాలాడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లోను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘనవిజయం సాధిస్తాడని బీజేపీశ్రేణులు చెబుతున్నాయి. అయితే దత్తతకు సంబంధించి ఇక్కడి ప్రజలందరూ ఆసక్తిగా ఉన్నారని, కచ్చితంగా తమనే గెలపిస్తారనే ఆశాభావంతో గులాబీ శ్రేణులున్నాయి. నవంబరు ఆరోతేదీ ఉదయం వరకు కాస్తంత ఓపిక పట్టగలిగితే ఎవరు గెలవనున్నారనేది తేలిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+