• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడులో గెలిచేదెవరు - మునిగేదెవరు : డిసైడ్ అయ్యేది ఇక్కడే..!!

|
Google Oneindia TeluguNews

మరి కొద్ది గంటల్లో మునుగోడు విజేత ఎవరో తేలిపోనుంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు పార్టీల నేతలు చేరుకుంటున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాలపైన ప్రభావం చూపే అవకాశం ఉండటంతో మూడు ప్రధాన పార్టీలకు ఇక్కడ గెలుపు కీలకం కానుంది. కానీ, గెలిచేదెవరు. మునుగోడులో పోటెత్తిన పోలింగ్ లో మునిగేదెవరు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ ఫలితం ఉత్కంఠ పెంచుతోంది. పోలింగ్ సరళి.. ఎగ్జిట్ పోల్స్ తరువాత కాంగ్రెస్ మూడో స్థానం అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

తొలి స్థానం టీఆర్ఎస్ దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఆలస్యంగా ఎగ్జిట్ పోల్స్ ను బయట పెట్టిన సంస్థలు కొన్ని బీజేపీకి అనుకూలమని నివేదికలు ఇచ్చాయి. అటు టీఆర్ఎస్ కే గెలుపు అవకాశాలు అంటూ విశ్లేషణలు వస్తున్నాయి. కానీ, అదే పక్కాగా జరిగేది అన్నట్లుగా నాగార్జున సాగర్ ఫలిం సమయంలో చెప్పినంత ధీమా మంత్రం కనిపించటం లేదు. ఇటు బీజేపీ కూడా తమ గెలుపు ఖాయమని చెబుతోంది. ఈ రెండు పార్టీలు పైకి ధీమగా కనిపిస్తన్నా..లోలోపల మాత్రం కొంత ఆందోళన ఉంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. దాదాపు రాత్రి 9 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కొనసాగింది.

Munugode By poll: Huge polling in two mandals crucial that decides the winner

మునుగోడు లో 93 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఇది కొత్త రికార్డు. సాయంత్రం జరిగిన పోలింగ్ ఇప్పుడు విజేతను డిసైడ్ చేయనుంది. ఇప్పుడ ఆ పోలింగ్ ఎవరికి అనుకూలమనేది ఏ పార్టీ స్పష్టంగా నిర్దారణకు రాలేకపోతున్నాయి. అయితే, బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ వ్యక్తిగత బలం పైనే ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా ఆధారపడింది. పార్టీ నేతలంతా సహకరించినా.. కాంట్రాక్టు కోసమే పార్టీ మారారంటూ ప్రత్యర్ధి పార్టీలు ప్రచారం బలంగా వెళ్లింది. అదే సమయంలో.. ఎనిమిదేళ్ల ప్రభుత్వ పాలన పైన వ్యతిరేకత ఉంటేనే ఈ స్థాయిలో పోలింగ్ జరుగుతుందనేది మరో కోణంలో జరుగుతున్న విశ్లేషణ. మునుగోడు అర్బన్..రూరల్ ప్రాంతాల్లో బీజేపీకి అనుకూల పరిస్థితులు కనిపించినట్లు తెలుస్తోంది. కౌంటింట్ ప్రారంభం కాగానే తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు.

ఆ తరువాత తొలుత చౌటుప్పల్.. చివర గట్టుప్పల్ కౌంటింగ్ జరగనుంది. మధ్యాహ్నం తుది ఫలితం వెల్లడి కానుంది. తొలి మూడు రౌండ్ల ట్రెండ్స్ తో ఫలితం ఎలా ఉండబోయేది ఒక అంచనా వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ నేతలు మాత్రం దుబ్బాక తరహాలో చివరి రౌండ్ వరకు ఉత్కంఠ కొనసాగుతుందని చెబుతున్నారు. దీంతో, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మునుగోడు ఫలితం అన్ని పార్టీలకూ కీలకం కానుంది. ఈ ఉప ఎన్నిక ఫలితంపైనే బీజేపీ విస్తరణ ఆశలు పెట్టుకుంది. బీజేపీ గెలిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోపు మరిన్ని ఉప ఎన్నికలకు ఈ ఫలితం ముడిపడి ఉంటుంది.

English summary
All set for munugode counting amid main parties huge expections on winning by poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X