Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మునుగోడు సిత్రాలు: నోటిఫికేషన్ రాకముందే రచ్చ; అక్కడ నాటుకోళ్ళు, గొర్రెలు మాయం; పండుగ వాతావరణం!!

మునుగోడు ఉపఎన్నిక అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అందుకే మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టాయి. తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ లు మునుగోడు ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాగైనా విజయకేతనం ఎగురవేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన అన్ని పార్టీలు నియోజకవర్గంలో మండలాల వారీగా పార్టీ నేతలతోనూ, ప్రజలతోనూ సమావేశాలు నిర్వహిస్తూ దూకుడుగా ముందుకు వెళుతున్నాయి.

మునుగోడులో ఘుమఘుమలాడుతున్న నాన్ వెజ్ కూరలు, నిత్యం విందులు

మునుగోడులో ఘుమఘుమలాడుతున్న నాన్ వెజ్ కూరలు, నిత్యం విందులు

ఇక ఈ సమావేశాలలో ప్రజలను, వచ్చిన పార్టీ నేతలను ఆకట్టుకోవడం కోసం, తమకు ఓట్లు వేసేలా వారిని మార్చుకోవడం కోసం నానా పాట్లు పడుతున్నారు రాజకీయ పార్టీల నేతలు. ఒక రకంగా చెప్పాలంటే మునుగోడులో ప్రస్తుతం పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఏ మండలాల్లో చూసిన నిత్యం రాజకీయ పార్టీల నేతలు సమావేశాలు నిర్వహిస్తూ ఉండటంతో, ఈ సమావేశానికి వచ్చిన వారికి నిత్యం భోజనం పెడుతూ విందులు ఏర్పాటు చేస్తున్నారు. నాన్ వెజ్ కర్రీ లతో, ఘుమఘుమలాడే వంటకాలతో వారి మనసును గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మునుగోడులో నాటు కోళ్ళకు భలే డిమాండ్.. అన్ని మండలాల్లో నాటు కోళ్ళు మాయం

మునుగోడులో నాటు కోళ్ళకు భలే డిమాండ్.. అన్ని మండలాల్లో నాటు కోళ్ళు మాయం

ఇదిలా ఉంటే మునుగోడులోని ఏడు మండలాలలో ప్రచారానికి వచ్చే పార్టీ కార్యకర్తలు, నేతలు, జనాలకు కావలసిన విందు, మందు ఏర్పాట్లు చేయడం నిత్యకృత్యంగా మారింది. ఇక విందులో నాటు కోళ్లకు ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. చాలామంది బ్రాయిలర్ కోడి తినడం కంటే, నాటుకోడిని తినడానికి ఎక్కువ మక్కువ చూపడంతో 7 మండలాల్లోనూ ఎక్కడ చూసినా నాటు కోళ్ల కొరత కనిపిస్తుంది. ఇక ఎక్కడైనా నాటు కోళ్లు ఉన్నాయి అంటే డిమాండ్ వాటికి ఓ రేంజ్ లో ఉంది.

మటన్ కు విపరీతమైన డిమాండ్, ఏరులై పారుతున్న లిక్కర్

మటన్ కు విపరీతమైన డిమాండ్, ఏరులై పారుతున్న లిక్కర్

ఇక ఇదే సమయంలో నియోజకవర్గంలో గొర్రెలకు డిమాండ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇక విందు ఏర్పాటు చేసిన ప్రతీ చోట మటన్, నాటు కోడి తప్పనిసరిగా ఉండాల్సిందే. దీంతో అమాంతంగా మటన్ ధరలు కూడా మటన్ షాపుల వాళ్లు పెంచారంటే నియోజకవర్గంలో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అక్కడ కొందరు జనాలు మటన్ షాపులకు వెళ్లి కొనుగోలు చెయ్యకుండా, సభలు సమావేశాలు ఎక్కడ పెడతారా అన్నది ఆరా తీస్తున్నారు. ఇక ఇప్పటి నుండే మునుగోడులో మద్యం ఏరులై పారుతుంది.

 పోటాపోటీగా నాన్ వెజ్ విందులు.. అభ్యర్థులకు ఇప్పటి నుండే తలనొప్పులు

పోటాపోటీగా నాన్ వెజ్ విందులు.. అభ్యర్థులకు ఇప్పటి నుండే తలనొప్పులు

ఒకరిని మించి ఒకరు పోటీపడి నాన్ వెజ్ భోజనం పెట్టడం నియోజకవర్గంలోని ప్రజలకు, రాజకీయ పార్టీల నేతలకు పండుగలా మారితే, అభ్యర్థులకు మాత్రం పెద్ద తలనొప్పిగా తయారైంది. ఈ ఉప ఎన్నిక ప్రస్తానం పూర్తి అయ్యే సరికి ఎంత ఖర్చు అవుతుందో అన్న ఆందోళన వారిలో వ్యక్తం అవుతుంది. పొరపాటున నాన్ వెజ్ భోజనం పెట్టకపోతే ఎక్కడ తమ పార్టీ పైన సదభిప్రాయం పోగొట్టుకుంటామో అన్న ఉద్దేశంతో కచ్చితంగా నాన్ వెజ్ పెట్టాల్సిన పరిస్థితి మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ పార్టీల అభ్యర్థులకు వచ్చింది. మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఎన్నికల ప్రలోభాలకు తెర తీసినట్లు మునుగోడులో రాజకీయం స్పష్టంగా చెబుతుంది. ఇక మునుగోడులో పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే, ముందు ముందు మరెంత రసవత్తరంగా మారుతుందో అని అందరూ భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+