వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ లో మునుగోడు పంచాయితీ - మహిళా నేత ఆడియో వైరల్ : హుజూరాబాద్ ఫలితం మళ్లీ ..!!

|
Google Oneindia TeluguNews

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందింది. మునుగోడులో బై పోల్ తప్పదు. అన్ని పార్టీలు ఉప ఎన్నికకు సిద్దం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి..ప్రత్యేకంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ కు ఈ ఉప ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. రాజగోపాల్ తన రాజీనామా ప్రకటించిన వెంటనే మునుగోడులో సభ ఏర్పాటు చేసారు. ఇక, ఇప్పుడు టీఆర్ఎస్ సైతం అభ్యర్ధి ఎంపిక పైన సమావేశాలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ లో మునుగోడు మహిళా నేత ఆడియో పార్టీలో కలకలంగా మారింది.

పాల్వాయి స్రవంతి ఆడియో

పాల్వాయి స్రవంతి ఆడియో

కాంగ్రెస్ కు బలమైన నియోజకవర్గం కావటంతో తాము పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుస్తామనే ఉద్దేశంతో పలువురు ఔత్సాహికులు ుందుకు వస్తున్నారు. అందులో భాగంగా చలమల్ల కృష్ణారెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. దీని పైన పార్టీ అధికారికంగా నిర్ణయం తీసుకోకముందే పార్టీ నుంచి ఈ ప్రతిపాదనపైన వ్యతిరేకత వస్తోంది.తనకు టికెట్‌ ఇవ్వకపోతే హుజురాబాద్‌ వంటి అవమానం మరోసారి జరిగే అవకాశముందని.... పాల్వాయి స్రవంతి మాట్లాడిన ఆడియో.. ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. పాల్వాయి స్రవంతికి ఫోన్ చేసిన కార్యకర్త వచ్చే ఉప ఎన్నికల్లో పార్టీ తరపున మీరే పోటీ చేయాలంటూ కోరటంతో..అందుకు స్రవంతి సరే అనటంతో పాటుగా కొన్ని వ్యాఖ్యలు చేసారు.

హుజూరాబాద్ వంటి అవమానం

హుజూరాబాద్ వంటి అవమానం


తనకు టికెట్‌ ఇవ్వకపోతే కాంగ్రెస్‌కు పరాజయం తప్పదని పాల్వయి స్రవంతి పేర్కొన్నారు. కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే ఊరుకునేదిలేదని స్పష్టం చేశారు. రేవంత్ పరువు నిలవాలంటే గెలిచే వారికి టికెట్ ఇవ్వాలని చెప్పుకొచ్చారు. మునుగోడు సభలోనూ రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పేరును పదే పదే ప్రస్తావించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పాటుగా వ్యక్తిగత సంబంధాలతో ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు బీజేపీ లో చేరటంతో కాంగ్రెస్ పార్టీ అభిమానుల నుంచి మద్దతు దొరకదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

టీఆర్ఎస్ కసరత్తు

టీఆర్ఎస్ కసరత్తు

ఇక, టీఆర్ఎస్ నుంచి అభ్యర్ధి ఖరారు విషయంలో నియోజవకర్గ పరిధిలోని స్థానిక పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశం అయ్యారు. మునుగోడు లో విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మునుగోడు అభ్యర్ధి ఖరారు.. పార్టీ వ్యూహాల పైన చర్చించేందుకు పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ ఛార్జ్ మాణికం ఠాగూర్ ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసారు. కార్యచరణ ఈ సమావేశం లో ఖరారు చేయనున్నారు. అటు బీజేపీ ఈ నెల 21న మునుగోడులో అమిత్ షా సభ.. పార్టీలో చేరికల పైన ఫోకస్ పెట్టింది.

English summary
Parties foucs on by poll in Munugodu,Congress leader Palvai Sravanthi Audio viral in politcal circles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X