రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై హత్యాయత్నం: సోదరుడి పిల్లల ఘాతుకం, నిందితుల అరెస్ట్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై ఐదురోజుల క్రితం జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఏప్రిల్ 5న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దయాచారిపై బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు.

వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలిసింది. కాగా, దయాచారిపై హత్యాయత్నానికి పాల్పడింది ఆయన బందువులేనని పోలీసులు నిర్ధారించారు. ఆస్తి కోసమే దయాచారిపై ఆయన సోదరుడి పిల్లలు ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

Murder attempt on Retired IAS Officer: accused arrested

ఆటో బోల్తా: 15మందికి గాయాలు

ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలో మంగళవారం ఉదయం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 10మందికి స్వల్ప గాయాలు కాగా, ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కూసుమంచి మండలం జుజ్జులరావుపేట గ్రామానికి చెందిన 22 మంది మిరప కూలీలు ఆటోలో పోచారం గ్రామానికి వెళ్తున్నారు.

కిష్టారం గ్రామ సమీపంలోకి రాగానే ట్రాక్టర్‌ను తప్పించబోయి ఆటో రోడ్డు పక్కనున్న గుంతలో పడిపోయింది. మూడు పల్టీలు కొట్టడంతో అందులో ఉన్న కూలీలకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని రక్షించి, 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Accused were arrested in case of a murder attempt on Retired IAS Officer in Jubilee Hills in Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X