వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడిన మిస్టరీ: మహిళా క్యాషియర్‌తో అక్రమ సంబంధం వల్లనే హత్య...

బ్యాంక్ జోనల్ మేనేజర్ హత్య కేసును పోలీసులు ఏడాది తర్వాత ఛేదించారు. మహిళా క్యాషియర్‌తో అక్రమ సంబంధమే అతని ప్రాణాలు తీసినట్లు గుర్తించారు.

|
Google Oneindia TeluguNews

వరంగల్: గత సంవత్సరం సెప్టెంబరు 14 రాత్రి నెల్లికుదురు మండల బంజర స్టేజి వద్ద ఎస్‌బిహెచ్‌ జోనల్‌ మేనేజర్‌ రవికాంత్‌ మృతి మిస్టరీని ఎట్టకేలకు తొర్రూరు పోలీసులు ఛేదించి, నిందితులను అరెస్టు చేసినట్లు తొర్రూరు డిఎస్‌పి రాజారత్నం తెలిపారు. స్థానిక డిఎస్‌పి రాజారత్నం తెలిపిన వివరాల ప్రకారం - విశాఖపట్నం ఎస్‌బిహెచ్‌ జోనల్‌లో పనిచేస్తున్న పి. రవికాంత్‌ తొర్రూరు ఎస్‌బిహెచ్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న సమయంలో ఇదే శాఖలో క్యాషియర్‌గా పనిచేస్తున్న మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది.

వీరి విషయాన్ని తెలుసుకున్న బ్యాంకు అధికారులు మహిళను వర్ధన్నపేటకు బదిలీ చేయగా ఆమె భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు గుగులోతు శ్రీహరి అధికారులపై అకారణంగా నా భార్యను వర్ధన్నపేటకు బదిలీ చేశారని ఆగ్రహించడంతో ఆమెను ఫత్తేపురం బ్రాంచికి బదిలీ చేయడం జరిగింది. మేనేజర్‌ క్యాషియర్‌ మధ్య నడుస్తున్న అక్రమ సంబంధం విషయమై భర్త శ్రీహరికి తెలియడంతో మేనేజర్‌పై తొర్రూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదు చేశారు.

అయినా వీరిద్దరి మధ్య సంబంధం కొనసాగుతుండటంతో మళ్లీ వరంగల్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడ కూడా రవికాంత్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు. ఎస్‌బిహెచ్‌ ఉన్నతాధికారులు దీనిపై స్పందించి విశాఖపట్నం జోనల్‌కు బదిలీ చేసినా వీరిద్దరి మధ్య ఫోన్‌లో సంభాషణలు నడుస్తూనే ఉన్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌ 14న రవికాంత్‌ మహిళకు ఫోన్‌చేసి నేను మహబూబాబాద్‌కు వస్తున్నాను, నీవుకూడా రావాలని చెప్పడంతో ఇదే అదునుగా భావించిన ఆ మహిళ తన మరిది గుగులోతు సిరికి విషయం చెప్పడంతో ప్లాన్‌ ప్రకారం రవికాంత్‌ కారులో ఎక్కి తొర్రూరుకు వచ్చే మార్గమధ్యంలోని బంజర స్టేజి వద్ద మూత్ర విసర్జన పేరుతో రోడ్డు లోపలకు తీసుకువెళ్లి ముద్దాయి చంద్రకళ తన చీరకొంగుతో ముఖంపై చ్టుి మెడకు గట్టిగా పట్టుకొని సిరి సహాయంతో మెడకు ఉరివేసి హత్య చేయడం జరిగింది.

Murder case mystery busted by Torrur police

ఈ విషయం భర్త శ్రీహరికి తెలుపడంతో వారిని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆనాడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసి, వైద్య పరీక్షల అనంతరం వచ్చిన ఆధారాలతో వీరిని అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటపడిందని, వీరిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు పంపినట్లు డిఎస్‌పి రాజారత్నం తెలిపారు. ఈ సమావేశంలో సిఐ శ్రీధర్‌రావు, ఎస్‌ఐలు రమణమూర్తి, తహెర్‌బాబా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు- మహిళా మావోయిస్టు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఆదివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మమిళా మావోయిస్టు మృతి చెందింది. బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఉడతమల్లకవురుగట్ట అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సరిహద్దు అడవుల్లో కూంబింగ్‌కు వెళ్లిన గ్రౌహౌండ్స్‌ బలగాలకు మావోయిస్టులు తారసపరడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

ఈ ఘటనలో మావోయిస్టు మిలీషియా సభ్యురాలు ఒకరు మృతి చెందారు. ప్రత్యేక పోలీసులు మావోయిస్టు మృతదేహాన్ని రాత్రి వరకు అతికష్టం మీద చర్లకు తీసుకువచ్చి అక్కడి నుంచి భద్రాచలం తరలించారు. సంఘటన జరిగిన ప్రాంతంలో తుపాకీ, తపంచా, మోర్టారు, విప్లవ సామాగ్రి లభ్యమైంది.

English summary
A bank Zonal manger murder mystery has been busted by Torroor police in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X