నోట్ల రద్దు షాక్: గంటల్లో రూ.100 కోట్ల బిజినెస్, జ్యూవెల్లరీ షాప్ ఓనర్ అరెస్ట్
నోట్ల రద్దు ప్రకటన అనంతరం గంటల వ్యవధిలోనే రూ.100 కోట్ల వ్యాపారం చేసిన ముసద్దీలాల్ జ్యువెల్లర్స్ యజమాని కైలాష్ గుప్తాను సీసీఎస్ పోలీసులు బుధవారం నాడు అరెస్టు చేశారు.
హైదరాబాద్: నోట్ల రద్దు ప్రకటన అనంతరం గంటల వ్యవధిలోనే రూ.100 కోట్ల వ్యాపారం చేసిన ముసద్దీలాల్ జ్యువెల్లర్స్ యజమాని కైలాష్ గుప్తాను సీసీఎస్ పోలీసులు బుధవారం నాడు అరెస్టు చేశారు.
నోట్ల రద్దు ప్రకటన అనంతరం పెద్ద ఎత్తున చాలామంది బంగారం కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముసద్దీలాల్ జ్యువెల్లర్స్ గంటల వ్యవధిలోనే 5,200 మందికి బంగారం అమ్మినట్లు లెక్కలు చూపించారు. బంగారం లేకున్నా అతను నగదును తీసుకున్నారు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారాలను తారుమారు చేశారు. దీని పైన విచారణ జరిపిన సిసిఎస్ పోలీసులు గంటల వ్యవధిలో రూ.100 కోట్ల వ్యాపారం చేసినట్లు, అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో అతనిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications