పాతబస్తీలో గణేషులకు ముస్లీం యువత స్వాగతం, అక్కడే బెజవాడ మహాగణపతి నిమజ్జనం
హైదరాబాద్: పాతబస్తీలో గణేష్ విగ్రహాలకు ముస్లీం యువత స్వాగతం పలుకుతోందని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ఆదివారం నాడు చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. మతసామరస్యానికి ప్రతీకగా నిమజ్జనం కొనసాగుతోందన్నారు.
గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లూ పకడ్బంధీగా చేశామని డిసిపి కమలాసన్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది భక్తుల తాకిడీ ఎక్కువగా ఉందని చెప్పారు.
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోందని డిజిపి అనురాగ్ శర్మ అన్నారు. బందోబస్తులో తెలంగాణ రాష్ట్ర పోలీసులతో పాటు మరో పదివేల మంది పోలీసులను రప్పించామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. హోంమంత్రితో కలిసి ఏరియల్ సర్వే చేస్తామన్నారు.
పాతబస్తీలోని చార్మినార్ ప్రాంతంలో గణేశ్ శోభాయాత్ర ఏర్పాట్లను హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా గణేశ్ నిమజ్జనాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బందోబస్తులో ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఐటీబీపీ పోలీసులు సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
నిమజ్జనానికి బయలుదేరిన గణనాథులు
భాగ్యనగరంలో గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. పలు ప్రాంతాల నుంచి ఘన నాథుల విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరాయి. అలంకరించిన వాహనాల పైన విగ్రహాలను కొలువు తీర్చి, తరలిస్తున్నారు. వీనుల విందైన గీతాలతో గణేషుడి ముందు నృత్యాలు చేస్తూ భక్తి శ్రద్ధలతో నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్ వైపు తీసుకెళ్తున్నారు.
గణపతి బొప్ప మొరియా అంటూ ఏకదంతున్ని కొలస్తూ ముందుకు సాగుతున్నారు. సాయంత్రానికల్లా వినాయక సాగర్ (హుస్సేన్‌సాగర్) ప్రాంతం వినాయకుని విగ్రహాలతో తరలివచ్చే వాహనాలు, భక్తులతో రద్దీగా మారనుంది. వేల సంఖ్యలో భక్తులు ట్యాంక్‌బండ్ పైకి వస్తున్నారు.
శోభాయాత్రను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. పలు జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ను పోలీసులు నియంత్రిస్తున్నారు. 30 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 25 వేల సీసీ కెమెరాల నిఘా మధ్య గణేష్ శోభా యాత్ర కొనసాగుతోంది. 10 మౌంటెడ్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.
బడంగ్ పేట గణేష్ లడ్డూ రూ.6.50 లక్షలు
బడంగ్ పేట గణేష్ లడ్డూ రూ.6.50 లక్షలు పలికింది. కాగా, బాలాపూర్ లడ్డూ రూ.10.32 లక్షలు పలికిన విషయం తెలిసిందే. గత ఏడాది కంటే బాలాపూర్ లడ్డూ ఈసారి రూ.82వేలు అధికంగా పలికింది.
ఏడు గంటలకు విజయవాడ మహాగణపతి నిమజ్జనం
తొలిసారిగా 63 అడుగుల ఎత్తులో పూర్తిగా మట్టితో తయారు చేసిన విజయవాడ మహాగణపతి విగ్రహ నిమజ్జనం ఆదివారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది. డూండి గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడలోని ఘంటశాల ప్రభుత్వ సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం 10 రోజులుగా పూజలందుకుంటోంది.
ఉత్సవాల ముగింపు సందర్భంగా మహాగణపతిని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మానససరోవరం, కృష్ణానది జలాలతో రాత్రి 7 గంటలకు మహాభిషేకం ప్రారంభమవుతుంది.
అనంతరం విగ్రహంలో అంతర్గతంగా ఏర్పాటు చేసిన నీటి పంపుల ద్వారా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. రాత్రి 11 గంటలకు ఈ కార్యక్రమం పూర్తవుతుంది. మొత్తం లక్ష లీటర్ల నీటిని ఈ నిమజ్జనం కోసం వినియోగిస్తున్నట్లు వారు చెప్పారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications