Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బండి సంజయ్ ఏఎస్ రావు నగర్ గుట్టు విప్పుతా-రాసలీలు బయటపెడుతా-మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

తన జీవితం జీవితం తెరిచిన పుస్తకమని... తప్పుడు ఆరోపణలు చేయొద్దని మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు. తాను ఎక్కడికెళ్లినా వెంట 40 మంది ఉంటారని... ప్రైవేట్ లైఫ్ ఏమీ ఉండదని అన్నారు. న్యాయం కోసం తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనని అన్నారు. ఏపీ సీఎం జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారని.. న్యాయం కోసం తాను 16 ఏళ్లయినా సరే జైల్లో ఉంటానని చెప్పారు. మైనంపల్లికి భయమంటే తెలియదని... ఎవరికీ బెదిరే వ్యక్తి కాదని అన్నారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని వదిలే ప్రసక్తే లేదన్నారు.

బండి సంజయ్‌పై సొంత కార్యకర్తలే ఫిర్యాదులు : మైనంపల్లి

బండి సంజయ్‌పై సొంత కార్యకర్తలే ఫిర్యాదులు : మైనంపల్లి


బండి సంజయ్ గురించి కరీంనగర్ నుండి తమకు వందలాది కాల్స్ వస్తున్నాయని మైనంపల్లి పేర్కొన్నారు. సొంత కార్యకర్తలే ఆయనపై ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. బండి సంజయ్‌ని ఎంపీ పదవి నుండి దింపే వరకు ఊరుకోనని హెచ్చరించారు. పూర్తి ఆధారాలతో బండి సంజయ్‌పై మీడియా సమావేశం పెడుతానని... తాను భయపడే వ్యక్తిని కాదని...బయపడితే రాజకీయాల్లో ఉండలేనని అన్నారు. దళితుల‌పై దాడి చేశానని అంటున్నారు.. అందులో తాను ఎక్కడా లేనని తెలిపారు. సీసీ‌టీవీ ఫుటేజ్ చూస్తే ఆ విషయం తెలుస్తుందన్నారు. ఆ సమయంలో అసలు తాను ఇంట్లో లేనని స్పష్టం చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. నువ్వు ఒక చెంప కొడితే నేను రెండు చెంపలు కొట్టే వాణ్ణి అంటూ బండి సంజయ్‌‌పై విరుచుకుపడ్డారు.

బండి సంజయ్ రాసలీలు బయటపెడుతా : మైనంపల్లి

బండి సంజయ్ రాసలీలు బయటపెడుతా : మైనంపల్లి

తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడనని మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. దాడి జరిగిన సమయంలో... తాను ఇంట్లో ఉన్నట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. బండి సంజయ్‌తో ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాల్ విసిరారు. బండి సంజయ్‌ ఏఎస్‌రావునగర్‌ రహస్యం గుట్టు విప్పుతానని... త్వరలో బండి సంజయ్‌ రాసలీలలు బయటపెడుతానని మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

దళితులంతా కదిలొస్తారు : మైనంపల్లి

దళితులంతా కదిలొస్తారు : మైనంపల్లి

గతంలో బీజేపీ అధ్యక్షులుగా వ్యవహరించిన లక్ష్మణ్,కిషన్ రెడ్డి,ఇంద్రాసేనా రెడ్డి... వీరెవరూ బండి సంజయ్‌లా వ్యవహరించలేదన్నారు. అధ్యక్ష పదవి చేపట్టిన మొదటిరోజు నుంచి బండి సంజయ్ సీఎంపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది... ఏమైనా చేయగలుగుతామంటే.. ఏ పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. గవర్నర్‌గా ఉన్న దత్తాత్రేయను కలవడం తప్పా అని ప్రశ్నించారు. దళితుల కోసం తాను చాలా సేవా కార్యక్రమాలు చేశానని... వారంతా ఇప్పుడు తనకోసం కదిలొస్తామని చెబుతున్నారని తెలిపారు. బండి సంజయ్ ఏం మాట్లాడినా... తప్పకుండా ప్రతిచర్య ఉంటుందన్నారు. మైనంపల్లి ఇలా కూడా ఉంటాడా అని చూపించేందుకే రెండు రోజుల క్రితం సంజయ్‌పై ఆగ్రహంతో విరుచుకుపడినట్లు చెప్పారు.

ఎందుకీ వివాదం...

ఎందుకీ వివాదం...

స్వాతంత్య్ర దినోత్సవం రోజు మల్కాజ్‌గిరిలో బీజేపీ, టీఆర్‌ఎస్ నడుమ తీవ్ర వాగ్వాదం,ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.భరతమాత ఫోటో విషయంలో బీజేపీ కార్పోరేటర్ శ్రవణ్,టీఆర్ఎస్ వర్గాల మధ్య గొడవ జరిగింది. అయితే మైనంపల్లి హనుమంతరావు కార్పోరేటర్ శ్రవణ్ భుజంపై చేయి వేయడమే గొడవకు కారణమనే వాదన కూడా వినిపిస్తోంది. ఆ గొడవ చినికి చినికి పెద్దగా మారి శ్రవణ్‌పై దాడి దాకా వెళ్లింది. ఈ దాడిని నిరసిస్తూ మైనంపల్లి ఇంటి వద్ద దళిత మోర్చా మహిళలు నిరసన తెలియజేశారు. ఆ సమయంలో మైనంపల్లి వారిని కులం పేరుతో దూషించి దాడి చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. దీనిపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో... 24 గంటల్లో మైనంపల్లిని అరెస్ట్ చేయాలంటూ కమిషన్ ఆదేశాలిచ్చింది.

మైనంపల్లిపై బండి సంజయ్ విమర్శలు...

మైనంపల్లిపై బండి సంజయ్ విమర్శలు...


దాడిలో గాయపడిన కార్పోరేటర్ శ్రావణ్‌ను బండి సంజయ్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్‌ మైనంపల్లి హనుమంతరావుపై పరుష పదజాలంతో విమర్శలు చేశారు. యూస్‌లెస్ ఫెలో గూండాయిజం చేయడానికేనా నువ్వు ఎన్నికైందని మైనంపల్లిపై ఫైర్ అయ్యారు. గతంలో మైనంపల్లి బీజేపీలో వచ్చి చేరుతానని తన చుట్టూ తిరిగాడన్నారు. కానీ లుచ్చా రాజకీయాలు చేస్తున్నాడు... ప్రజలను ఇబ్బందిపెడుతున్నాడని పార్టీలో చేర్చుకోలేదన్నారు. ముఖ్యమంత్రి వచ్చి బతిమాలితే టీఆర్ఎస్‌లో చేరినట్లు చెప్పుకుంటున్నాడని అన్నారు. ఈ క్రమంలో ఆయన కొంత పరుష పదజాలంతో మైనంపల్లిపై విరుచుకుపడ్డారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినా వారు చూస్తూ ఊరుకున్నారని ఆరోపించారు. ఇదే పాలసీని అవలంభిస్తే తాము కూడా మొదలుపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో టీఆర్ఎస్ నాయకులు జాతీయ గీతాన్ని ఆలపించలేదని.. బాబా సాహెబ్ అంబేడ్కర్,గాంధీ ఫోటోలను అవమానించారని ఆరోపించారు.ఈ ఘటనపై డీజీపీ,కమిషనర్ స్పందించాలని డిమాండ్ చేశారు.

Recommended Video

    Kalva Sujatha questioned what would have happened to the police system
    బండి సంజయ్‌పై మైనంపల్లి ఎటాక్...

    బండి సంజయ్‌పై మైనంపల్లి ఎటాక్...

    ఆ తర్వాత మైనంపల్లి హనుమంతరావు అంతకు రెట్టింపు పరుష పదజాలంతో బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. 'నీకు బీజేపీ స్టేట్ ప్రెసిడ్ంట్ ఇచ్చారు... అది ప్రూవ్ చేసుకో... ఇక్కడికొచ్చి ఎన్విరాన్‌మెంట్ మొత్తం స్పాయిల్ చేశావు. మల్కాజ్‌గిరిలో ప్రశాంతత ఉండాలనేది మైనంపల్లి ఆకాంక్ష. ఎప్పుడైనా అద్దంలో నీ ముఖం చూసుకున్నావా... నువ్వొక వుమెనైజర్‌... నీ అరాచకాలన్నీ బయటపెడుతా... అసలు కామన్ సెన్స్ ఉందా నీకు.. గుండు పగలగొట్టేస్తా... నేను పిలిస్తే జిల్లాల నుంచి లక్షల మంది తరలిస్తారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజు టీఆర్ఎస్,బీజేపీ కొట్టుకుంటే కాంప్రమైజ్ చేశా... నువ్వెంత నీ బతుకెంత... బచ్చాగానివి... నీవన్నీ బయటకు తీస్తా. నేను కష్టపడి పైకొచ్చా... నాదేంది నువ్వు బయటపెట్టేది... దేనికంటే దానికి సిద్ధం. వరదల సహాయక చర్యల్లో తిరిగినప్పుడు నువ్వెక్కడున్నావ్. దమ్ముంటే రా... ఏ చౌరస్తాకు రమ్మంటే అక్కడికి వస్తా.నిన్ను గాడిద మీద ఎక్కించి గుండు కొట్టి తిప్పేదాకా నిద్రపోడు మైనంపల్లి....' అని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+