రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడిన అస్తిపంజరం మిస్టరీ: తల్లీసోదురుల పనే

By Pratap
|
Google Oneindia TeluguNews

 mystery of skeleton busted in Rangareddy district
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పరిగి పట్టణంలో లభిం చిన అస్థిపంజరం కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. జులాయిగా తీరుగుతూ కుటుంబాన్ని వేధిస్తున్న కుమారుడిని తల్లి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తల్లికి మరో కూమారుడు సహకరించినట్లు వెల్లడైంది. సోమవారం పరిగి పోలీస్‌ష్టేషన్‌లో సీఐ ప్రసాద్‌ మీడియా సమావేశంలో అందుకు సంబందించిన వివరాలు వెల్లడించారు.

పరిగికి చెందిన బి. బాలాజీ, బుజ్జిబాయిలకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్దవాడు రాకేశ్‌(22) పనిచేయకుండా జులాయిగా తీరుగుతూ గ్రామాల్లో మేకల చోరీ చేస్తూ ఉండేవాడు. రాకేశ్‌తో పాటు తండ్రి బాలాజీ కూడా మేకల దొంగతనం చేసేవాడు. పరిగి, మహ్మదాబాద్‌ పోలీస్‌స్టేషన్లలో వీరిపై కేసులు నమోదై జైలుశిక్ష కూడా అనుభవించారు. తల్లి బుజ్జీబాయి, చిన్న కుమారుడు కమాల్‌లు కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బులు తాగడానికి ఇవ్వమని రాకేశ్‌ ప్రతి రోజు వేధించేవాడు.

ఆ వేధింపులు భరించలేక తల్లి చిన్న కుమారుడు కలిసి రాకేశ్‌ను తాళ్లతో కట్టివేసి ఇంట్లో నుంచి వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చాక కట్లు వదిలేవారు. ఈ మధ్య కాలంలో తండ్రి మరోసారి మేకలు చోరీ చేసి జైలుకు వెళ్లాడు. తండ్రిని జైలు నుంచి విడిపించడం కోసం డబ్బులు కావాలని తల్లిని వేధించడం మొదలు పెట్టారు. ఎప్పటిలాగే ఈ నెల 1న డబ్బులు కావాలని వేధించడంతో రాకేశ్‌ను తాళ్లతో కట్టేసి తల్లి, చిన్నకుమారుడు వెళ్లిపోయారు. రాత్రికి వచ్చాక కట్లు విప్పారు.

దీంతో రాకేశ్‌ అదే తాళ్లతో తల్లి బుజ్జీబాయి, తమ్ముడు కమాల్‌ను కొట్టడం ప్రారంభించాడు. ఈ బాధలు తట్టుకోలేక బుజ్జీబాయి, కమాల్‌లు రాకేశ్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. దీంతో తల్లి బుజ్జీబాయి రాకేశ్‌ కాళ్లు పట్టుకోగా, తమ్ముడు కమాల్‌ గొంతు నులిమి హత్య హత్యచేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఇంటికి దగ్గర్లోని గ్లోబల్‌ జూనియర్‌ కళాశాల వెనకాల ఉన్న పాడుబడిన బావిలో రాకేశ్‌ మృతదేహాన్ని పడేసి పైన గడ్డివేసి మంటబెట్టారు. అయినా పూర్తి గా కాలకపోవడంతో ఆదివారం, సోమవారం కూడా ఉదయం వెళ్లి మరోమారు మృతదేహం పై చేత్త వేసి మంట పెట్టి వదిలేశాడు.

ఈ నెల 6న గ్లోబల్‌ కళాశాలలోకి దుర్వాసన రావడంతో ప్రిన్సిపాల్‌ సయ్యద్‌ ముజీబ్‌ పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయతీ సిబ్బంది దుర్వాసన వస్తున్నచోట పరిశీలించగా వ్యక్తి కళేబరం కనిపించింది. దీంతో ప్రిన్సిపాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ప్రసాద్‌ తెలిపారు. కాగా గ్రామంలో రాకేశ్‌ కొంత కాలంగా కనిపించడం లేదనే విషయం తెలిసింది.

ఈ విషయాన్ని కుటుంబీకులను అడగ్గా అతను లేడనీ, ఎక్కడికి వెళ్లాడో తెలియదనే సమాధానం చెప్పారు. దీంతో అనుమా నం వచ్చి కమాల్‌ను విచారించగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయని పరిగి సీఐ పి. ప్రసాద్‌ తెలిపారు. ఈ హత్య కేసులో బుజ్జిబాయి, కమాల్‌లను సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ షేశ్‌శంశోద్దీన్‌ పాల్గొన్నారు.

English summary
mother and brother killed a person at Parigi town in Rangareddy district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X