వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ మొద్దు నిద్ర, అది చంద్రబాబు తరం కాదు: నాగం, ఓయూకు రాహుల్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై భారతీయ జనతా పార్టీ నేత నాగం జనార్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కరువు ఉంటే సిఎం కెసిఆర్ మొద్దు నిద్ర పోతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ తక్షణమే మేల్కొని రైతులను ఆదుకోవాలని నాగం సూచించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడం ఏపి సిఎం, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తరం కాదని స్పష్టం చేశారు.
కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టే హక్కు తెలంగాణకే ఉందని నాగం అన్నారు.

Nagam fires at KCR and Chandrababu

ప్రభుత్వం చేనేతల సంక్షేమాన్ని విస్మరించింది

తెలుగుదేశం హయాంలో చేనేతలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టామనీ, ప్రస్తుత ప్రభుత్వం చేనేతల సంక్షేమాన్ని విస్మరించిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జగిత్యాలలో చేనేత కార్మికులకు టీడీపీ సన్మానం చేసింది. ఈ సందర్భంగా కార్మికులతో ఎల్ రమణ సహపంక్తి భోజనం చేశారు.

27న ఓయూకు రానున్న రాహుల్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగస్టు 27న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రానున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన రాహుల్ గాంధీని కోరినట్టు సమాచారం.

అదే విధంగా ఆగస్టు 28న వరంగల్‌లో రాహుల్ సభ ఉంటుందని తెలిపారు. దీంతో పాటు అదే జిల్లాలోని భూపాలపల్లిలో సింగరేణి కార్మికులతో ముఖాముఖి ఉంటుందని ఉత్తమ్ చెప్పారు.

English summary
Bharatiya Janata Party leader Nagam Janardhn Reddy on Friday fires at Telangana CM K Chandrasekhar Rao and Andhra Pradesh CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X