కెసిఆర్ జైలుకెళ్ళడం ఖాయం: నాగం సంచలనం
తెలంగాణ సీఎం కెసిఆర్‌పై బిజెపి సీనియర్ నేత నాగం జనార్థన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పాలన అవినీతిమయమని, కేసీఆర్ జైలుకు వెళ్లక తప్పదని తీవ్ర విమర్శలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కెసిఆర్‌పై బిజెపి సీనియర్ నేత నాగం జనార్థన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పాలన అవినీతిమయమని, కేసీఆర్ జైలుకు వెళ్లక తప్పదని తీవ్ర విమర్శలు చేశారు.
తాను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని, కానీ, ఇప్పటివరకు కెసిఆర్ లాంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదన్నారు. టిఆర్ఎస్ అబద్ధాల పార్టీ అని
నాగం జనార్థన్‌రెడ్డి ఆరోపణలు గుప్పించారు.

తమ పార్టీ కార్యకర్తలకే ట్రాక్టర్లు, గొర్రెలు, బర్రెలు ఇస్తున్నారని నాగం ఆరోపించారు. బీజేపీ మద్దతిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని నాగం జనార్థన్‌రెడ్డి గుర్తు చేశారు. కేవలం కేసీఆర్ ఒక్కరి వల్లే ఈ రాష్ట్రం ఏర్పడలేదని ఆయన అన్నారు.
అన్ని పథకాల్లో అవినీతి రాజ్యమేలుతోందని నాగం జనార్థన్‌రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఇంత అవినీతిని తాను చూడలేదన్నారు. కెసిఆర్ ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని నాగం జనార్థన్‌రెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications