వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Nagar Kurnool: తెల్కపల్లి జడ్పీటీసీ ఎన్నిక చెల్లదు.. హైకోర్టు..

|
Google Oneindia TeluguNews

నాగర్ కర్నూల్ జడ్పీ చైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి జడ్పీటీసీ ఎన్నిక చెల్లదని సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. పెద్దపల్లి పద్మావతి 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెల్కపల్లి మండలం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆమె నాగర్ కర్నూల్ జడ్పీ చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం 1995 తర్వాత ముగ్గురు పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అయితే ఆమెఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీ చేసి గెలిచారు.

ముగ్గురు సంతానం

ముగ్గురు సంతానం


పద్మావతికి ముగ్గురు సంతానం ఉన్నట్లు తేలడంతో ఆమె ఎన్నిక చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర గెలిచినట్లుగా ప్రకటించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆమెకు ముగ్గురు సంతానం ఉన్నారని ఆధారాలతో సహా స్క్రృూటినీకి ముందే ఎన్నికల అధికారులకు ఫిర్యాద్ చేసిన పట్టించుకోలేదని కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర అన్నారు. దీంతో సుమిత్ర జిల్లా ఎలక్షన్ ట్రిబ్యునల్​లో పిటిషన్ ను ఆశ్రయించారు.

జులై 15న తీర్పు

జులై 15న తీర్పు


ట్రిబ్యునల్.. పద్మావతి ఎన్నిక చెల్లదని ఈ ఏడాది జులై 15న తీర్పు వెల్లడించింది. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటించాలని జిల్లా ఎలక్షన్ అథారిటీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై పద్మావతి హైకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆమె ఎన్నిక చెల్లదంటూ తీర్పు చెప్పింది.

జట్పీ ఛైర్మన్

జట్పీ ఛైర్మన్


పద్మావతిపై అనర్హత వేటు పడడంతో కొత్త జట్పీ ఛైర్మన్ ఎవరు అని చర్చరలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్, ఊర్కొండ జడ్పీటీసీ శాంతకుమారి జడ్పీ ఛైర్మన్ రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ తీర్పుపై పద్మావతి అప్పీల్ కు వెళ్లకపోతే వారం రోజుల్లోనే కాంగ్రెస్ నుంచి గెలిచిన సుమిత్ర జడ్పీటీసీగా ప్రమాణం చేసే అవకాశం ఉంది.

English summary
On Monday, the High Court ruled that the election of Nagar Kurnool ZP chairperson Peddapalli Padmavathi ZPTC was invalid. Orders have been issued to declare the Congress candidate as the winner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X