కొండా సురేఖ క్షమాపణలు.. నాగార్జున కీలక నిర్ణయం..
మంత్రి కొండా సురేఖపై అక్కినేని నాగార్జున కేసు ఉపసంహరించుకున్నారు. ఇటీవల నాగార్జున కుటుంబానికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో పరువునష్టం కేసును విత్ డ్రా చేసుకున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు తెలియజేశారు. సమంత విడాకుల విషయంలో మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు గతంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆమెపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు.
అక్కినేని నాగార్జున కుటుంబంపై గతంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. ఆ వ్యాఖ్యలపై తాను చింతిస్తున్నానని ఆమె ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈ క్రమంలో తాజాగా అక్కినేని నాగార్జున సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొండా సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పడంతో నాగార్జున తన పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.
I would wish to clarify that the statement I had made in relation to @iamnagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu or his family members.
— Konda Surekha (@iamkondasurekha) November 11, 2025
I had no intention of hurting or defaming Akkineni Nagarjuna Garu or his family members.
I regret any unintended impression…
" అక్కినేని నాగార్జునకు సంబంధించి నేను చేసిన వ్యాఖ్యలు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలన్న ఉద్దేశంతో చేయలేదు. నాగార్జున కుటుంబ సభ్యులను బాధపెట్టాలని లేదా వారి పరువుకు భంగం కలిగించాలన్న ఉద్దేశం నాకు లేదు. వారి కుటుంబ విషయంలో నేను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా పొరపాటు జరిగితే దానికి చింతిస్తున్నాను. నాగార్జున కుటుంబంపై నేను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను" అని కొండా సురేఖ తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా క్షమాపణ చెప్పారు.

గతంలో కేటీఆర్ పై విమర్శలు చేసిన సందర్భంలోనే నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆ వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున కుటుంబం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు నాగార్జున. అయితే తాజాగా ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో నాగార్జున తన పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications