నాగార్జున ఫాంహౌస్‌లో విషాదం: దంపతుల మృతి

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన వ్యవసాయ క్షేత్రం(ఫాంహౌస్)లో విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యుత్ఘాతంతో ఓ దంపతులు మృతి చెందారు.

తూర్పుగోదావరి జిల్లా బొబ్బిడవరం మండలం కొత్తలంకకు చెందిన వెంకటరాజు(36), దుర్గ(32) దంపతులు రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని పాపిరెడ్డిగూడ శివారులో గల నాగార్జునకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

Nagarjuna farmhouse : Couple found dead

ఆదివారం రాత్రి ఇంట్లో విద్యుత్ సరఫరాలో అంతరాయడం ఏర్పడటంతో పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించడానికి వెంకటరాజు వెళ్లాడు. తెగిపడిన విద్యుత్ తీగను గమనించకుండా తగలడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

భర్త ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా.. అతడ్ని కాపాడే ప్రయత్నంలో భార్య దుర్గ కూడా విద్యుత్ షాక్‌కు గురైంది. దీంతో భార్యాభర్తలు అక్కడే ప్రాణాలు విడిచారు. ఇద్దరి మరణంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+