నాగార్జునసాగర్ - శ్రీశైలం.. ప్రకృతి ఒడిలో కృష్ణానదిలో విహారం, ప్యాకేజ్ ఇలా!

టూరిస్టులకు తెలంగాణ టూరిజం శాఖ శుభవార్త చెప్పింది . కృష్ణమ్మ అందాలను చూసి మై మరిచిపోయేలా పర్యాటకులకు అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. చుట్టూ ఎత్తైన కొండలు, నల్లమల అటవీ అందాలు, కృష్ణమ్మ పరవళ్ళ మధ్య ప్రకృతి అందాలను చూసి ఆస్వాదిస్తూ నాగార్జునసాగర్ నుండి శ్రీశైలం వరకు ప్రయాణించే అద్భుతమైన ప్యాకేజీని అందిస్తోంది తెలంగాణ టూరిజం.

నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం లాంచీ యాత్ర
కృష్ణమ్మ ఒడిలో, లాంచీలో ప్రయాణం చేసి సేద తీరే అవకాశం ప్రకృతి ప్రేమికులకు కల్పిస్తుంది. ఇక ఆ ప్యాకేజీ వివరాల్లోకి వెళితే నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచి యాత్ర నేటి నుండి అందుబాటులోకి వస్తుంది. ప్రతి శనివారం ఇలా లాంచీ యాత్ర ఉండేలాగా టూరిజం శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎక్కువ మంది ప్రయాణికులు ఈ లాంచీలలో ప్రయాణం చేసేలాగా లాంచీని సిద్ధం చేశారు.

Nagarjunasagar - Srisailam cruise Tour Relax in the lap of nature with affordable tourism package

Take a Poll

సోమశిల నుండి శ్రీశైలం.. ఇప్పుడు సాగర్ నుండి శ్రీశైలం కూడా
ఇప్పటికే సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం ప్రారంభం కాగా వారానికి మూడుసార్లు ఈ లాంచీ ప్రయాణాన్ని సాగిస్తోంది. ప్రతి మంగళవారం, గురువారం, శనివారాలలో ఉదయం 9 గంటలకు ఇది సోమశిల నుండి ప్రారంభమవుతుంది. ఇక ఇదే క్రమంలో నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు కూడా లాంచీ ప్రయాణం ప్రారంభం అయింది.

ప్యాకేజీ ధర ఇలా..
ఈ ప్రయాణం కోసం పెద్దలకు 2000 రూపాయలు టికెట్ గా నిర్ణయించారు పిల్లలకు 1600 రూపాయలుగా టికెట్ ధర ఉంది. అయితే వెళ్లి తిరిగి మళ్లీ లాంచీలోనే వెనక్కి రావాలంటే 3250 చార్జ్ అవుతుంది. ఈ ప్యాకేజీని ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వారు సాగర్ నుంచి శ్రీశైలం కు, శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కు లాంచీలో ప్రయాణం చేయొచ్చు.

అద్భుతమైన ఈ ప్రకృతి ప్రయాణాన్ని ఆస్వాదించాలంటే వెళ్లి రండి
హైదరాబాద్ బషీర్ బాగ్ సి ఆర్ ఓ 98485 40371, 98481 25720, నాగార్జునసాగర్ లాంచీ యూనిట్ 79979 51023 నంబర్ల ద్వారా ఈ ప్యాకేజీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవాలి అనుకునేవారు https://tgtdc.in/home వెబ్సైట్ ను కూడా చూడవచ్చని చెబుతున్నారు. మరెందుకు ఆలస్యం అద్భుతమైన ఈ ప్రకృతి ప్రయాణాన్ని ఆస్వాదించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+