Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాయ్‌ఫ్రెండ్‌తో వెళ్లి.. తుదిశ్వాస విడిచింది!: ప్రమాదమా, అతనే కారణమా?

నల్గొండ: జిల్లాలోని కొత్తపల్లికి చెందిన బీటెక్ విద్యార్థిని శ్వేత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ భరత్‌తో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. మరోవైపు, ప్రమాదంలో గాయాలు అయ్యాయనేది వట్టిదేనని, అతనే గాయపరిచి, చావుకు కారణమయ్యాడని ఆమె తల్లిదండ్రుల ఆరోపణ.

శ్వేత (24) చౌటుప్పల్ మండలంలోని ఓ కళాశాలలో చదువుతోంది. కొంతకాలం క్రితం నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలుకు చెందిన భరత్‌తో పరిచయం ఏర్పడింది. శ్వేత గత నెల 30వ తేదీన పరీక్ష రాయడానికి వెళ్లింది. పరీక్ష రాసి ఇంటికి బయలుదేరుతుండగా బాయ్ ఫ్రెండ్ భరత్ వచ్చాడు.

వారిద్దరు బైక్ పైన వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఇద్దరు కిందపడగా, శ్వేత తలకు గాయమైంది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించాడు. తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. వారు రాగానే అతను అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. వైద్యులు చికిత్స అందించారు. కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

ప్రమాదం కారణంగా గాయాలయ్యాయని అతను చెబితే, ఆమె తల్లిదండ్రులు మాత్రం తమ కూతురును కిడ్నాప్ చేసి, గాయపరిచారని ఆరోపిస్తున్నారు. నిజంగానే ప్రమాదం జరిగితే అతను కనిపించకుండా ఎందుకు పోయాడని, అతనికి ఎందుకు గాయాలు కాలేదని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అతనిపై పోలీసులు మర్డర్ అటెంప్ట్, కిడ్నాప్ కేసులు పెట్టారు.

Nalgonda girl student dies while treatment after accident

అంతకుముందే తల్లిదండ్రుల ఫిర్యాదు

శ్వేత తల్లిదండ్రులు అంతకుముందే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనను ప్రేమించమని శ్వేతను కొద్ది రోజులుగా భరత్ వేధిస్తున్నాడు. ఇటీవల ఆమెకు మరొకరితో నిశ్చితార్థం అయింది. జూన్‌ 30న పరీక్ష రాసేందుకు కాలేజీకివెళ్లింది. అక్కడ తనను పెళ్లి చేసుకోవట్లేదన్న కోపంతో శ్వేతను కిడ్నాప్ చేసేందుకు యువకుడు బలవంతంగా బైక్‌పై ఎక్కించుకున్నాడు.

తప్పించుకునేందుకు ప్రయత్నించిన యువతికి తుఫ్రాన్‌పేట శివారులో వాహనం పైనుంచి కింద పడింది. దీంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే భరత్‌ అంబులెన్స్‌లో ఆమెను హైదరాబాద్‌లోని హయతనగర్‌ ప్రయివేటు ఆసుపత్రికి తరలించాడు. తర్వాత అంబులెన్స్‌ డ్రైవర్‌తో శ్వేత ఫ్యామిలీకి సమాచారం అందించాడు.

విషయం ఆలస్యంగా తెలుసుకున్న యువతి తండ్రి మధుసూదన్ రెడ్డి బుధవారం సాయంత్రం చౌటుప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతుర్ని కిడ్నాప్‌ చేసి హతమార్చేందుకు ప్రయత్నించాడని పోలీసులకు తెలిపారు. ఈ మేరకు నిందితుడిపై కిడ్నాప్‌, హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+