8 ఏండ్ల బాలికపై దారుణం.. పోక్సో కోర్టు సంచలన తీర్పు
సమాజంలో రోజురోజుకూ మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు అధికంగా జరుగుతున్నాయి. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా కొందరు కామాంధులు రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్ల అయితే చాలు అన్నట్లుగా మృగాళ్లా దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా ఇలాంటి ఘటనలు మాత్రం జరగకుండా ఆగడం లేదు. ఈ క్రమంలో తాజాగా నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. నిందితుడికి 21 ఏళ్ల శిక్ష, 30 వేల జరిమానా ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. అలాగే బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. పోక్సో కేసులో నిందితుడికి 21 ఏళ్ల శిక్ష, 30 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి రోజారమణి తీర్పు వెలువరించారు. ఈ ఘటన 2018లో చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
2018 లో ఎనిమిదేండ్ల బాలికపై రాములు అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే ఏడాది అతడిపై చిట్యాల పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే 2022 నుంచి నల్లగొండ పోక్సో కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. తాజాగా విచారణ అనంతరం కోర్టు తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో బాధిత కుటుంబం సంతృప్తిని వ్యక్తం చేసింది. ఇక గత ఏడాది కాలంగా 19 మంది కామాంధులకు కఠిన కారాగార శిక్ష విధించారు. మరోవైపు మహిళలను వేధింపులకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇక ఇటీవల నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో జరిగిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. నకిరేకల్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్న మామిడి శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు గత కొన్నాళ్లుగా అదే స్కూల్లో చదువుతున్న ఒక బాలికను తీవ్రంగా టార్చర్ చేస్తున్నాడంటూ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారికి లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications