జేమ్స్ కంటే ముదురు: 300మంది మహిళతో.., లొంగకుంటే బెదిరింపు
హైదరాబాద్/నల్గొండ: హైదరాబాదులో మరో కీచకుడు వెలుగు చూశాడు. 300 అమ్మాయిలకు ఎయిడ్స్ అంటించడమే లక్ష్యంగా ఉప్పల్‌కు చెందిన సైకో జేమ్స్.. ఇప్పటికే దాదాపు 150 మందికి ఎయిడ్స్ అంటించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అలాంటి కీచకుడి ఉదంతమే వెలుగు చూసింది. ఎఫ్‌సీఐలో గతంలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేసిన మధు అనే వ్యక్తి అమ్మాయిలను ట్రాప్ చేసి వంచించినట్లుగా గుర్తించారు. అతనిపైన ఆరోపణలు రావడంతో అప్పుడే శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.
మధు పలువురు మహిళలను ట్రాప్ చేసి వంచిస్తున్నట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకు 300 మంది వరకు మహిళలు, అమ్మాయిలను అతను వంచించినట్లుగా తెలుస్తోంది. తనకు లొంగని అమ్మాయిలను వేధించేవాడు. నల్గొండ జిల్లాకు చెందిన మధు పైన సిసిఎస్‌లో కేసు నమోదయింది. అమ్మాయిలను వేధించేందుకు నిందితుడు మధు పుస్తకంలో డేటా మెయింటెన్ చేస్తున్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

కాగా, వృత్తిరీత్యా ఆటోడ్రైవర్ అయిన జేమ్స్ అనే వ్యక్తి తనకు ఎయిడ్స్ ఉండటంతో 300 మహిళలకు దానిని వ్యాపింప చేయాలని సైకోగా మారిన విషయం తెలిసిందే. జల్సా జీవితానికి అలవాటు పడి ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డాడు.
వైద్య పరీక్షల్లో ఆ విషయం బయటడినా మహిళల జీవితాలతో చెలగాటమాడటం మానలేదు. చోరీ కేసులో దర్యాప్తు క్రమంలో పోలీసులకు ఈ విస్మయపరిచే విషయాలు చెప్పాడు. ఇప్పటి వరకు 150 మందికి పైగా మహిళలతో శారీరక సంబంధాలు కొనసాగించినట్లు చెప్పాడు.
ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది. మల్కాజిగిరి మీర్జాలగూడకు చెందిన జోసెఫ్ జేమ్స్(31) ఆటో నడుపుతూ దురలవాట్లకు బానిసయ్యాడు. దొంగచాటుగా మట్కా నిర్వహించడం ద్వారా డబ్బులు బాగా సంపాదించేవాడు. దీంతో విలాసాల కోసం తరచూ వ్యభిచారిణుల దగ్గరికి వెళ్లేవాడు.
ఆరేళ్ల కిందట మొదటిసారి వివాహం చేసుకున్నాడు. ఇతడి విపరీత ప్రవర్తన, చెడు తిరుగుళ్లు నచ్చని భార్య వదిలేసి వెళ్లింది. అలా మూడు పెళ్లిళ్లు పెటాకులు కావడంతో ప్రస్తుతం ఒంటరి జీవితం గడుపుతున్నాడు. విచ్చలవిడితనం పరాకాష్ఠకు చేరింది.
ఎక్కువగా రైల్వే స్టేషన్లు, బస్టాపుల వద్ద తచ్చాడుతూ ఒంటరిగా కనిపించే మహిళల్ని మాయమాటలతో మభ్యపెట్టి లొంగదీసుకునేవాడు. ఇళ్లు వదిలి వచ్చిన మహిళలైతే ఆ ప్రాంతాల్లో సంచరిస్తారనేది జేమ్స్ ఆలోచనగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అలాగే ఆటోలో పరిచయమైన మహిళల్నీ ఆకర్షించి వలలో వేసుకునేవాడు.
పిల్లలకు మధ్యాహ్నభోజనం ఇచ్చేందుకు పాఠశాలలకు వెళ్లే మహిళలతోనూ మాటలు కలిపి సంబంధాలు నెరిపినట్లు పోలీసులకు తెలిపాడు. ఈ క్రమంలో ఎనిమిది నెలల కిందట జేమ్స్.. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లడంతో హెచ్‌ఐవీ సోకినట్లు బహిర్గతమైంది.
సుమారు 150 మంది వరకు మహిళల ఫోన్ నంబర్లు అతడి సెల్‌లో లభ్యం కావడంతో పోలీసులు ఆ దిశగా ఆరా తీస్తున్నారు. కొద్దిరోజుల కిందట జేమ్స్ ఉప్పల్ సెవెన్ హిల్స్‌కాలనీలో నివసిస్తున్న తన స్నేహితుడి ఇంట్లో నుంచి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు.
నగల మాయం విషయమై స్నేహితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తుండగానే వాహన తనిఖీల్లో జేమ్స్ అనూహ్యంగా పోలీసులకు దొరికాడు. వాహన తనిఖీలు చేస్తుండగా.. ఉప్పల్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో జేమ్స్‌ను అదుపలోకి తీసుకున్నారు. విచారణలో తనకు ప్రాణాంతకవ్యాధి ఉందని చెప్పాడు.












Click it and Unblock the Notifications