తెలంగాణలోని ఆ రైల్వే స్టేషన్ రూపు రేఖలు మారిపోతున్నాయ్

తెలంగాణలో అత్యంత రద్దీతో కూడుకున్న నల్గొండ రైల్వే స్టేషన్‌.. రూపు రేఖలు సమూలంగా మారిపోతున్నాయి. తెలంగాణ నుంచి ఏపీ మీదుగా దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే పలు రైళ్లకు హాల్ట్ సౌకర్యం ఉన్న స్టేషన్ ఇది. దీని ఆధునికీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దాదాపుగా పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. పునర్నిర్మాణం, ఆధునికీకరణ పనులు పూర్తయ్యాక.. చర్లపల్లి తరహాలో ఇప్పుడున్న వాటి కంటే అదనపు రైలు సర్వీసులు ఇక్కడ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అమృత్ భారత్ కింద తెలంగాణలో పలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ సహా మలక్‌పేట్, మహబూబ్ నగర్, కామారెడ్డి, నిజామాబాద్, మల్కాజ్‌గిరి, ముద్ఖేడ్, ఆదిలాబాద్, రామగుండం, కరీంనగర్, మహబూబాబాద్, హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్, జహీరాబాద్, తాండూరు, భద్రాచలం రోడ్, హుప్పుగూడ, యాదాద్రి, ఖాజీపేట్ జంక్షన్, మధిర.. వంటి రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద అభివృద్ధి చేస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ.

Nalgonda Railway Station Upgrades to Modern State-of-the-Art Travel Experience with Rs 17 Crore

ఇప్పటికే సికింద్రాబాద్, యాదాద్రి, బేగంపేట్ వంటి రైల్వే స్టేషన్ల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి కూడా. 718 కోట్ల రూపాయల వ్యయంతో సికింద్రాబాద్ అభివృద్ధి పనులను చేపట్టారు. మూడు దశల్లో ఇవి పూర్తి కానున్నాయి. వచ్చేే 40 సంవత్సరాల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మితం కానుంది. ఇంకో రెండేళ్లల్లో పూర్తి స్థాయిలో ఇది అందుబాటులోకి రానుంది.

ఇప్పుడిదే జాబితాలో నల్గొండ రైల్వే స్టేషన్ చేరింది. 17 కోట్ల రూపాయల వ్యయంతో దీని పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 90 శాతం పూర్తయ్యాయి. ప్లాట్‌ఫారాలపై షెడ్ల నిర్మాణం, విస్తరణతో పాటు సీటింగ్, మంచినీటి వసతి వంటి అదనపు సౌకర్యాలు కల్పన పనులు ముగిశాయి. లిఫ్టులు, అప్రోచ్ రోడ్డు, పార్కింగ్, సర్కులేటింగ్ ఏరియా, దివ్యాంగుల సౌకర్యాల వంటివి నిర్మితం అయ్యాయి. కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి.

ప్రస్తుతం 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు సాగుతున్నాయి. వెయిటింగ్ హాల్స్ పునరుద్ధరణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇక్కడ ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+