కాంగ్రెస్ తొలి జాబితాలో 70 మంది అభ్యర్థుల పేర్లు...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ తొలి జాబితాను రేపు విడుదల చేసేందుకు సిద్ధమతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో 70 మంది అభ్యర్థులు పేర్లు జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాకు కాంగ్రెస్ పార్టీ సిఈసి కూడా ఆమోదం తెలిపిందని వార్తలు వస్తున్నాయి. పార్టీలోని ముఖ్య నేతల పేర్లన్నీ దాదాపుగా తొలిజాబితాలోనే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ జాబితాను రేపే విడుదల చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రెడి అయినట్లు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.
70 అసెంబ్లీ నియోజకవర్గాల : తెలంగాణలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసిందని ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కె మురళీధరన్ చెప్పారు. అక్టోబర్ 18న ప్రారంభమయ్యే పార్టీ బస్సుయాత్రలోపే ఈ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయనున్నట్ల తెలిపారు. ఈ సందర్భంగా మురళీధరన్ పొత్తుల గురించి కూడా ప్రస్తావించారు. సీపీఐ, సీపీఎంలతో పొత్తు చర్చలు కొనసాగుతున్నాయని, ఆ చర్చలు శనివారంలోపు ముగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆ చర్చల అనంతరం మిగిలిన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిటీ మళ్లీ సమావేశమవుతుందని ఈ సందర్భంగా చెప్పుకోచ్చారు. అయితే, కాంగ్రెస్ పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను రూపొందించేందుకు స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘంగా నాలుగు గంటలపాటు సమావేశం నిర్వహించిందని తెలుస్తోంది.

సిపిఎం, సిపిఐ పార్టీలకు సీట్లు : అయితే, ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ పొత్తులపై త్వరలో ఓ నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ముందునుంచే చెబుతున్నట్లుగానే సిపిఎం, సిపిఐ పార్టీలతో పొత్తుకు సిద్ధమవుతుంది. ఈ విషయంపై కాంగ్రెస్ నేత వేణుగోపాల్ వామపక్షాల నాయకులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీలకు నాలుగు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే మరో రెండు స్థానాలు కావాలంటూ కమ్యూనిస్టులు పట్టుబడుతున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే మరోసారి వామపక్షనాయకులతో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మరో రెండుమూడు రోజుల్లో ఈ విషయంపై స్పష్టత రానున్నది.












Click it and Unblock the Notifications