ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..!!
సినీ హీరో..హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఆంధ్రాలోని హిందూపురం ఎమ్మేల్యే అయిన తెలంగాణకు సేవలు చేస్తానని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌కు కాకుండా ఇంకెవరకీ భారత రత్న ఇస్తారని ప్రశ్నించారు. కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చూపిస్తామంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చారు. తనను అతిథిగా సంబోధించడం భావ్యం కాదని పేర్కొన్నారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ మినీ మహానాడులో పాల్గొన్న బాలకృష్ణ తెలుగు దేశం పార్టీ, ఎన్టీఆర్ తయారు చేసిన నాయకులు ఎంతో మంది వేరే పార్టీలలో ముఖ్య నాయకులుగా ఉన్నారన్నారు. ఎన్టీఆర్ పేరుతో
వంద సంవత్సరాల క్రితం ఒక వెలుగు వెలిగిందన్నారు. ఆ వెలుగు వెయ్యి సంవత్సరాలు వెలుగుతుందని చెప్పుకొచ్చారు. తెలుగువాడి ఆత్మాభిమానం, ఆత్మగౌరవంను నిలపెట్టింది ఎన్టీఆర్ అని బాలయ్య పేర్కొన్నారు. ఎన్టీఆర్ పెట్టిన పథకాలు ఇంకా కొనసాగుతున్నాయని...ఇప్పుడు అవ్వే పథకాలు పేర్లు మార్చి ఇప్పుడు నడిపిస్తున్నారని వివరించారు. ఎన్టీఆర్ కు భారత తర్న ఇవ్వాలని నందమూరి కుటుంబం, టీడీపీ, అభిమానుల తరుపున బాలకృష్ణ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉందన్నారు.

టీడీపీ తరపున మా కుటుంభం తరపున కేంద్ర ప్రభుత్వంను అభ్యర్దిస్తున్నట్లు బాలయ్య చెప్పుకొచ్చారు. సాంకేతికంగా విడిపోయినా.. ఏపీ, తెలంగాణ అనే తేడా లేకుండా అన్నదమ్ములుగా కలిసే ఉందామని చెప్పారు. పార్టీ కార్యకర్తగా, ఎమ్మెల్యేగా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నాను. తెలంగాణలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు. ఎన్టీఆర్ పేరు చెప్పగానే ప్రతి తెలుగు గుండె పొగరుతో నినదిస్తోందని వ్యాఖ్యానించారు. సామాన్యుడి కోసం ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారన్నారు. పేదలకు రాజకీయాలు పరిచయం చేసిన నేత ఎన్టీఆర్ గా పేర్కొన్నారు. కాంక్రీట్ శ్లాబ్‌తో పక్కా ఇళ్ళను ఎన్టీఆర్ దేశానికి పరిచయం చేశారన్నారు. మహిళల కోసం పద్మావతి యూనివర్సిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేసారు. ఎందరో నాయకులను ఎన్టీఆర్ రాజకీయ భిక్షను పెట్టారని వివరించారు ఎన్టీఆర్ స్పూర్తితో తెలుగు యువత సేవా కార్యక్రమాలు కొనసాగించాలని బాలయ్య పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications