ఆమెనే పెళ్లి చేసుకున్న హరికృష్ణ: వస్తానో రానో.. హోటల్ నుంచి వెళ్తూ వ్యాఖ్యలు
Recommended Video

హైదరాబాద్: నందమూరి హరికృష్ణకు ఇద్దరు భార్యలు, నలుగురు సంతానం. భార్యల పేర్లు లక్ష్మీ, షాలిని. జానకిరామ్, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు కొడుకులు. సుహాసిని కూతురు. హరికృష్ణ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.
హరికృష్ణ మొదటి భార్య లక్ష్మీ ఆయన క్లాస్‌మేట్. తన క్లాస్‌మేట్‌నే ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆమెది కూడా నిమ్మకూరే. మరో భార్య షాలిని... జూనియర్ ఎన్టీఆర్ తల్లి.

శివుడిని ఎక్కువగా ఆరాధించేవారు
హరికృష్ణ శివుడిని ఎక్కువగా ఆరాధించేవాడు. నల్గొండ జిల్లాలోని శివాలయాలకు తరుచూ వెళ్తుండేవారు. దాదాపు నెల రోజుల క్రితమే ఓసారి అక్కడి శివాలయానికి వెళ్లి వచ్చారు. ఆయనకు ఈ రోడ్డు పరిచయమే. అయితే అతివేగం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం, తలకు తీవ్ర గాయాలు కావడం వంటి కారణాలతో మృతి చెందారు.

సమైక్యాంధ్ర కోసం రాజ్యసభకు రాజీనామా
హరికృష్ణ టీడీపీ ఆవిర్భావం నుంచి ముఖ్యనేతగా ఉన్నారు. ఎన్టీఆర్ చైతన్యరథానికి సారథిగా ఉన్నారు. వేలు, లక్షల కిలోమీటర్లు నడిపిన అనుభవం ఉంది. 1996లో ఎమ్మెల్యేగా గెలిచారు. రవాణా శాఖ మంత్రిగా పని చేశారు. 2008లో టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. సమైక్యాంధ్ర కోసం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

శోక సముద్రంలో నందమూరి కుటుంబం
హరికృష్ణ మృతి నేపథ్యంలో నందమూరి కుటుంబం శోకసముద్రంలో ఉంది. హరికృష్ణను కడసారి చూసేందుకు ఆయన భార్య షాలిని, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీప్రణతి, సోదరి పురంధేశ్వరి, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, తెలుగు రాష్ట్రాల మంత్రులు, పలువురు ప్రముఖులు వచ్చారు.

నిమ్మకూరుతో వారికంటే ప్రత్యేక అనుబంధం
హరికృష్ణ మృతి విషయం తెలిసి నిమ్మకూరు గ్రామస్తులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఎన్టీఆర్ తర్వాత.. ఆయన పిల్లల్లో నిమ్మకూరుతో ఎక్కువ అనుబంధం ఉంది హరికృష్ణకే అంటున్నారు. ఆయన ఇక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడని, అందరితో కలివిడిగా ఉండేవారని, చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నాడని, నిమ్మకూరులో ఉన్న వారిలో చాలామంది పేర్లు హరికృష్ణకు తెలుసునని, ఈ గ్రామంలో ఎన్టీఆర్ తర్వాత.. ఏ ఇల్లు ఎవరిదో తెలిసిన వారు హరికృష్ణ అని చెబుతున్నారు.

హోటల్ సిబ్బందితో అలా చెప్పి వెళ్లిన హరికృష్ణ
హరికృష్ణకు దాదాపు ప్రతి రోజు అబిడ్స్‌లోని తన ఆహ్వానం హోటల్‌కు వెళ్లడం అలవాటు. నిన్న (మంగళవారం) హోటల్ నుంచి బయటకు వస్తూ వస్తానో రానో అని వెళ్లాడని హోటల్ సిబ్బంది చెబుతోంది. హోట్లల్లో 1001 రూం వాస్తు మార్పు చేయించాలని చెబుతుండేవారని గుర్తు చేసుకున్నారు. అయితే దేనికైనా సమయం రావాలి కదా.. అప్పుడే మార్పులు జరుగుతాయని చెప్పేవారని గుర్తు చేసుకున్నారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications