రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం, విషాదంలో నందమూరి కుటుంబం
Recommended Video

నల్గొండ:ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెెందారు. నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు ఎపి28బిడబ్ల్యు 2323 కారులో మరో ఇద్దరితో కలసి బయలుదేరిన హరికృష్ణ ప్రమాద సమయంలో తానే స్వయంగా నడుపుతున్నట్లు తెలిసింది.
చదవండి: నందమూరి హరికృష్ణ మృతికి కారణం ఇదే! హుటాహుటిన జూ.ఎన్టీఆర్, చంద్రబాబు
తెల్లవారుఝామున 4.30కి బయలుదేరిన కారు నార్కెట్ పల్లి-అద్దంకి రహదారిపై నల్గొండ జిల్లా అన్నేపర్తికి చేరుకోగానే ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ప్రమాద సమయంలో కారు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని తెలిసింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ తలకు,ఛాతీ భాగానికి బలమైన గాయాలు అయినట్లు తెలిసింది. దీంతో శ్వాస తీసుకోవడానికి ఆయన ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో హరి కృష్ణ కారు బోల్తా పడింది..

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణను చికిత్స నిమిత్తం కామినేని ఆస్పత్రికి తరలించారు. ఇదే రహదారిపై గతంలో హరికృష్ణ కుమారుడు ప్రమాదానికి గురై చనిపోయారు. ప్రమాదం విషయం తెలియగానే హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆస్పత్రికి బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు, నారా లోకేష్ కూడా హైదరాబాదుకు బయలుదేరారు. హరికృష్ణకు ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు.
అయితే, ప్రమాద స్థలంలో రెండు వాహనాలు ఉండడంతో హరికృష్ణ రోడ్డుపై పడిపోవడంతో హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు ఆ వాహనాన్ని ఢీ కొట్టి పల్టీ కొట్టిందా..? వేరే వాహనం రాంగ్‌రూట్‌లో వచ్చి ఎదురుగా ఢీకొట్టిందా..?...అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న నందమూరి కుటుంబసభ్యులు,అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాద వివరాలు సేకరిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. 2009 లో జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైనా ప్రాణాలతో బైటపడ్డారు. 2009 ఎన్నికల ప్రచారంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఖమ్మంలో జరిగిన ఎన్నికల సభలో పాల్గొని హైద్రాబాద్ తిరుగు ప్రయాణమైన సందర్భంలో ఆ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ తరువాత హరికృష్ణ పెద్ద కుమారుడైన నందమూరి జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర ఏపీ 29 బీడీ 2323 కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
తాజాగా నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ(61) మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయని చర్చించుకుంటున్నారు. పైగా నందమూరి హరికృష్ణ కుమారుడు జానకీరామ్ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన కారు నంబర్, హరికృష్ణ యాక్సిడెంట్ కు గురైన కారు నంబర్ 2323 కావడం విధి వైచిత్రి.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications