Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్టీఆర్ సినిమా రెండో భాగం కోసం బ్రాహ్మణి ఆసక్తి, నందమూరి సుహాసిని ఏం చెప్పారంటే?

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ఎన్టీఆర్ - కథానాయకుడు సినిమాను నారా బ్రాహ్మణి చూశారు. ఈ సినిమాపై ఆమె స్పందించారు. ఈ సినిమా తనకు ఎంతగానో నచ్చిందని తెలిపారు. తర్వాతి భాగం ఎన్టీఆర్ - మహా కథానాయకుడు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు.

ఎన్టీఆర్ - కథానాయకుడు సినిమాలోని ప్రతి నటుడు, నటి అద్భుత ప్రదర్శన చేశారని చెప్పారు. తన చిన్నతనంలో తాతయ్య (ఎన్టీఆర్)తో ఎక్కువ సమయం గడపలేకపోయానని చెప్పారు. ఆయన ప్రతిరోజు ఎంతో బిజీగా ఉండేవారని చెప్పారు. తన తాత ఎన్టీఆర్ పాత్రలో తన తండ్రి బాలకృష్ణ జీవించారని చెప్పారు.

 Nara Brahmini excited about NTR Mahakathanayakudu

ఎన్టీఆర్ కూతురు లోకేష్వరి మాట్లాడుతూ... చాన్నాళ్లకు తన తండ్రిని స్క్రీన్ పైన చూసినట్లుగా అనిపించిందని చెప్పారు. ఈ క్రెడిట్ బాలకృష్ణ, దర్శకులు క్రిష్‌లదే అన్నారు.

తన తాతయ్య గురించి తనకు పెద్దగా తెలియదని, కానీ ఈ సినిమా ద్వారా ఆయన గురించి చాలా తెలుసుకున్నానని నందమూరి సుహాసిని చెప్పారు. ఎన్టీఆర్, హరికృష్ణల పాత్రలలో బాలకృష్ణ, కళ్యాణ్ రామ్‌లు బాగా నటించారని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+