ప్రదీప్ చౌదరికి నోటీసు: నోటుకు ఓటు కేసులో నారా లోకేష్ ఇరుక్కుంటారా?
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో నోటీసు అందుకున్న యువ నేత ప్రదీప్ చౌదరి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు. నోటుకు ఓటు కేసులో నారా లోకేష్ పాత్రపై కూడా ప్రదీప్ చౌదరి నుంచి తెలంగాణ ఎసిబి అధికారులు ఆరా తీస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ప్రదీప్ చౌదరిని సాక్షిగానే ఎసిబి అధికారులు విచారణకు పిలిచారు.
ఈ కేసులో ఇప్పటికే వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్‌రెడ్డి, ఆయన డ్రైవర్, పని మనిషిలను సాక్షులుగా ఎసిబి విచారించింది. మరో వ్యక్తి జిమ్మిబాబు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా కేసు దర్యాప్తునకు సంబంధించి మరో నలుగురు కొత్త వ్యక్తులకు ఎసిబి నోటీసులు జారీ చేసింది. ప్రదీప్ చౌదరి, మనోజ్, సుధీర్, పుల్లారావు అనే నలుగురికి ఎసిబి అధికారులు నోటీసులు జారీ చేశారు.
వీరిలో ప్రదీప్ చౌదరి, మనోజ్, సుధీర్‌లు జూబ్లీహిల్స్ టిడిపి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనుచరులు. ప్రదీప్ చౌదరి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్‌కు సన్నిహితుడని సమాచారం. దాంతోపాటు వీరు నలుగురు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ టిఎన్‌ఎస్‌ఎఫ్ హైదరాబాద్ విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారని తెలిసింది.

పుల్లారావు ఉస్మానియా యూనివర్సిటీ టిఎన్‌ఎస్‌ఎఫ్ నాయకుడు. పుల్లారావుది ఖమ్మం జిల్లాగా తెలిసింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కారు డ్రైవర్ రాఘవేందర్‌రెడ్డిని కూడా విచారణకు హాజరుకావాలని ఎసిబి అధికారులు సమాచారం అందించారు. ఈ మేరకు రాఘవేందర్‌రెడ్డికి గతంలోనే కబురు పంపారు. అయితే అతడు సోమవారం ఎసిబి ముందుకు వస్తున్నట్లు తెలిసింది.
మిగిలిన నలుగురికి సిఆర్‌పిసి సెక్షన్ 160 (సాక్షి) కింద విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని నోటీసులో సూచించారు. సోమవారం ఉదయం 10.30 గంటల కల్లా బంజారాహిల్స్‌లోని ఎసిబి కార్యాలయానికి రావాలని నోటీసులో తెలిపారు. ఓటుకు నోటు కుట్రలో కీలకంగా మారిన డబ్బుకు సంబంధించిన సమాచారం రాబట్టేందుకు వారిని విచారణకు పిలిచినట్లు తెలిసింది.
తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇచ్చిన రూ. 50 లక్షల అడ్వాన్స్ చేరవేతలో వీరి పాత్ర ఉన్నట్లుగా ఎసిబికి సమాచారం అందినట్లు చెబుతున్నారు. అంతేగాక మిగిలిన నాలుగున్నర కోట్లను తమ మనుషుల ద్వారా పంపిస్తానని రేవంత్‌రెడ్డి, స్టీఫెన్‌సన్‌కు చెప్పినట్లుగా వీడియో పుటేజీలో స్పష్టంగా ఉన్న విషయం తెలిసిందే.
రేవంత్‌రెడ్డి చెప్పిన తన మనుషులు ఈ నలుగురే అనేందుకు ఎసిబికి ప్రాథమిక ఆధారాలు లభించినట్లు సమాచారం. అందులో భాగంగానే వారిని సాక్షులుగా విచారణకు పిలిపిస్తున్నట్లు తెలిసింది.ఓటుకు నోటు కేసు దర్యాప్తులో భాగంగా ఎసిబి అధికారులు రెండు రోజుల్లో మరికొందరు ముఖ్యులకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications