సెక్షన్ 8, ఏం జరుగుతోంది?: రాజ్‌తో గవర్నర్ రెండుసార్లు, రేవంత్ బెయిల్ పిటిషన్ 2సార్లు వాయిదా

హైదరాబాద్: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లి గవర్నర్‌తో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి గంటపాటు మాట్లాడారు. ఇది ఆసక్తిని కలిగించింది. మరోవైపు శుక్రవారం ఉదయం నరసింహన్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులతో భేటీ అయ్యారు.

తెలుగు రాష్ట్రాల మధ్య రగిలిన ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 అంశాల పైన చర్చించారని తెలుస్తోంది. అధికారులతో భేటీ కాగానే ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. తాజా పరిస్థితులు చర్చించారని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలతోను భేటీ అయ్యే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

శుక్రవారం ఉదయం 10.45 గంటలకు నార్త్ బ్లాకులోని హోంశాఖ కార్యదర్శి గోయల్‌తో గవర్నర్ భేటి అయ్యారు. ఆ తర్వాత జాయింట్ సెక్రటరీ అలోక్ కుమార్, గోయల్, నరసింహన్ హోంశాఖమంత్రితో భేటీ అయ్యారు. అనంతరం మళ్లీ విడిగా రాజ్‌నాథ్‌తో నరసింహన్ భేటీ అయ్యారు.

ఆ తర్వాత గవర్నర్ నరసింహన్ గోయల్‌తో భేటీ అయ్యారు. అనంతరం మళ్లీ రాజ్‌నాథ్‌తో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు అంశాలు చర్చకు వచ్చి ఉంటాయని అంటున్నారు.

Narasimhan busy in Delhi

సెక్షన్ 8 పైన గతంలో కేంద్రం పంపించిన గైడ్ లైన్స్ యథాతథంగా జరగాల్సిందేనని గవర్నర్‌కు స్పష్టం చేశారని వార్తలు వస్తున్నాయి. ప్రధాని, రాష్ట్రపతిల అపాయింటుమెంట్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. పలువురు కేంద్రమంత్రులను గవర్నర్ కలుస్తారు.

కాగా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి పిలుపు మేరకు గవర్నర్ నరసింహన్ గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. ఏపీ మంత్రులు, నేతల మాటల దాడి నేపథ్యంలో గవర్నర్ తన పదవికి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఆ స్థానంలో గవర్నర్‌గా నజ్మా హెప్తుల్లా గవర్నర్‌గా రావచ్చునని కూడా ప్రచారం సాగింది. అయితే, అదంతా వట్టిదేనని అంటున్నారు.

రేవంత్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ

ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.

రేవంత్ బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది. మధ్యాహ్నం రెండుంపావుకు వాయిదా పడింది. తెలంగాణ అడ్వోకేట్ జనరల్ అందుబాటులో లేనందున వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+